Hyderabad DAV School Case : బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ చిన్నారిపై అత్యాచారం కేసులో డ్రైవర్‌కు 20 ఏళ్ల శిక్ష
బంజారాహిల్స్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ లో నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపల్ కారు డ్రైవర్ అత్యాచారం చేసిన కేసులో ప్రిన్సిపల్ కారు డ్రైవర్ కు 20 ఏళ్ల శిక్ష విధిస్తు ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

Hyderabad DAV School Case
Hyderabad DAV School Case : హైదరాబాద్ బంజారాహిల్స్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ లో నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపల్ కారు డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో చిన్నారిపై అత్యాచారానికి తెగబడిన ప్రిన్సిపల్ కారు డ్రైవర్ కు 20 ఏళ్ల శిక్ష విధిస్తు ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. డీఏవీ స్కూల్లో చదివే చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడిన ప్రిన్సిపల్ డ్రైవర్ రజనీకాంత్ కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తు ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పుని వెలువరించింది.
2022 అక్టోబర్ 17న బంజారాహిల్స్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ లో నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపల్ కారు డ్రైవర్ రజనీకాంత్ అత్యాచారానికి పాల్పడినట్లుగా కేసు నమోదు అయ్యింది. 19న రజనీకాంత్ ను పోలీసులుఅరెస్ట్ చేశారు. నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడి రజనీకాంత్ ను దోషిగా నిర్ధారించిన కోర్టు 20ఏళ్లు శిక్ష విధిస్తు తీర్పునిచ్చింది.
బంజారాహిల్స్ రోడ్డు నం. 14లోని డీఏవీ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్న ఐదేళ్ల బాలికపై అదే స్కూల్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న 34ఏళ్ల భీమన రజినీకుమార్ లైంగికదాడికి పాల్పడ్డిన ఘటన ఉలిక్కిపడేలా చేసింది. స్కూళ్లకు తమ బిడ్డలను పంపించాలంటేనే తల్లితండ్రులు భయపడిపోయే పరిస్థితి అది. ఈ ఘటన పెను దుమారం లేవటంతో డీఏవీ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని మంత్రి మంత్రి సబిత ఆదేశించారు.
నిందితుడిని కాపాడేందుకు ప్రిన్సిపాల్ మాధవి ప్రయత్నిస్తున్నారని బాలిక తల్లిదండ్రులు ఆరోపించటంతో ఈకేసులో స్కూల్ ప్రిన్సిపాల్ మాధవిని కూడా అరెస్ట్ చేశారు. LKG చదివే నాలుగేళ్ల చిన్నారిపై స్కూల్ ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ రజనీకుమార్ రెండు నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసు విచారణ కొనసాగిన క్రమంలో తాజాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు దోషిగా నిర్దారించబడిన రజనీకాంత్ కు 20 ఏళ్ల శిక్ష విధిస్తు తీర్పునిచ్చింది.
ప్రిన్సిపాల్ స్కూల్ డ్రైవర్ రజనీకుమార్ రెండు నెలలుగా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. స్కూల్ లో ల్యాబ్ ల నిర్వహణ కూడా చూస్తున్న రజనీకాంత్ మరింత బరి తెగించి..ప్రిన్సిపాల్ మాధవి రూమ్ ఎదురుగా ఉన్న ల్యాబ్ లో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికీ చెప్పొద్దని బాలికను బెదిరించాడు. నీరసంగా ఉన్న బాలికను తల్లి పదే పదే ప్రశ్నించడంతో అత్యాచారం గురించి బాలిక తల్లితో చెప్పింది. వెంటనే తల్లిదండ్రులు బాలికను స్కూల్ కి తీసుకెళ్లగా.. నిందితుడిని గుర్తించింది. దీంతో పట్టరాని ఆవేశం తమ కూతుర్ని హింసించిన డ్రైవర్ కి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు.అనంతరం బాలిక తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈకేసు విచారణలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారిస్తు 20ఏళ్లు జైలు శిక్ష విధించింది.