హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. దొంగపై కాల్పులు జరిపిన సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య
కాల్పులు జరిగిన స్థలాన్ని సజ్జనార్ పరిశీలించారు.
DCP Chaitanya: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం చెలరేగింది. చాదర్‌ఘాట్‌లో సెల్‌ఫోన్ చోరీ చేసి పారిపోతున్న ఇద్దరు దొంగలను హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య గమనించి, అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో చైతన్యపై ఓ దొంగ దాడికి ప్రయత్నించాడు. డీసీపీ గన్‌మన్ సైతం కింద పడిపోయారు. గన్‌మన్ వెపన్‌ను తీసుకున్న డీసీపీ చైతన్య దొంగపై కాల్పులు జరిపారు.
Also Read: 20 ఏళ్లుగా కేసీఆర్, బీఆర్ఎస్ కోసం పనిచేశా.. అయినప్పటికీ.. వాళ్లు చేసింది ఓ కుట్రనా? కాదా?: కవిత
ఆ దొంగ భవనంపై నుంచి విక్టరీ మైదానంలోకి దూకాడు. తీవ్రగాయాలపాలైన దొంగను పోలీసులు పట్టుకున్నారు. బంజారాహిల్స్‌లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చేశారు.
స్వల్పంగా గాయపడిన చైతన్య మలక్‌పేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కాల్పుల ఘటనపై సీపీ సజ్జనార్ స్పందించారు. దొంగపూ డీసీపీ రెండు రౌండ్ల కాల్పులు జరిపారని తెలిపారు. కానిస్టేబుల్‌పై కూడా దొంగ దాడికి యత్నించాడని అన్నారు. కాల్పులు జరిగిన స్థలాన్ని సజ్జనార్ పరిశీలించారు.
