హైదరాబాద్ మీ సేవ కేంద్రాల దగ్గర బారులు తీరిన వరద బాధితులు…ఉదయం 5 గంటల నుంచే పడిగాపులు

Hyderabad Flood victims : హైదరాబాద్‌లోని మీ సేవా కేంద్రాల దగ్గర వరద బాధితులు బారులు తీరారు. వరద సాయం కోసం తమ పేర్లు నమోదు చేసుకునేందుకు చిక్కడపల్లిలోని మీ సేవ కేంద్రాల దగ్గర భారీగా క్యూ కట్టారు. మీ సేవ కేంద్రాలు తెరవక ముందే ఉదయం 6 గంటల నుంచి క్యూలో నిలబడి ఉన్నారు. కుత్బుల్లాపూర్‌లో ఉదయం 5 గంటల నుంచే పడిగాపులు కాస్తున్నారు.
హైదరాబాద్‌లో వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం రూ.10 వేల వరద సాయం ప్రకటించింది. అయితే ఈ సాయం కొందరికి మాత్రమే అందింది. అర్హులైన చాలా మందికి వరద సాయం అందలేదు. దీంతో పలు చోట్ల బాధితులు ఆందోళనలు చేయడంతో .. బాధితులు మళ్లీ పేర్లు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
https://10tv.in/balayya-and-jagan-names-on-america-election-ballot-paper/
మీ సేవ కేంద్రాలకు వచ్చి అప్లై చేసుకున్న వాళ్లకు ఆన్‌లైన్‌లోనే వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తమ పేర్లు నమోదు చేసుకునేందుకు మీ సేవ కేంద్రాల దగ్గర బారులు తీరుతున్నారు. ఉదయం నుంచే మీ సేవా కేంద్రాలకు తరలివచ్చి ….క్యూ లైన్లలో నిరీక్షిస్తున్నారు.