Hyderabad : కారులో తరలిస్తున్నహవాలా డబ్బు..స్వాధీనం చేసుకున్న పోలీసులు

కారులు తరలిస్తున్న హవాలా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ నగరంలోని యాప్రాల్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు కారులో తరలిస్తున్న రూ.20లక్షల హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్నారు మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు.

Hyderabad : కారులో తరలిస్తున్నహవాలా డబ్బు..స్వాధీనం చేసుకున్న పోలీసులు

Updated On : July 3, 2021 / 12:12 PM IST

hawala money seized in malkajgiri : కారులు తరలిస్తున్న హవాలా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ నగరంలోని యాప్రాల్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు కారులో తరలిస్తున్న రూ.20లక్షల హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్నారు మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు. మల్కాజ్‌గిరి ఎస్ఓటి సిఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పక్కా సమాచారం మేరకు సికింద్రాబాద్ నుంచి యాప్రాల్ కి జైలో కారులో రూ. 20 లక్షల రూపాయలు హవాలా డబ్బు తరలిస్తుంది.

యాప్రాల్ ఎక్స్ రోడ్ దగ్గర ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారిని జవహర్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. దీని వెనుక ఎవరున్నారు?ఎక్కడనుంచి ఎక్కడకు తరలిస్తున్నారు? అని జవహర్‌నగర్‌ పోలీసులు విచారిస్తున్నారు. కాగా..సికింద్రాబాద్ నుంచి యాప్రాల్‌ వైపు వెళ్తున్న కారులో భారీగా హవాలా డబ్బు తరలిస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని పలు కోణాల్లో విచారిస్తున్నారు.