Hyderabad Kidney Racket Case : హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసు.. ఇద్దరు కీలక నిందితులు అరెస్ట్.. ప్రధాన నిందితుడి కోసం పోలీసుల వేట..

కిడ్నీ మార్పిడి ఆపరేషన్ల గురించి ఆసుపత్రి సిబ్బందికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

Hyderabad Kidney Racket Case : హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసు.. ఇద్దరు కీలక నిందితులు అరెస్ట్.. ప్రధాన నిందితుడి కోసం పోలీసుల వేట..

Updated On : January 24, 2025 / 6:02 PM IST

Hyderabad Kidney Racket Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలకనంద హాస్పిటల్ యజమాని డాక్టర్ సుమంత్ తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. అలకనంద ఆసుపత్రిలో ఆరు నెలలుగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయి. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఏకంగా ఓ ముఠానే ఏర్పాటు చేసుకున్నాడు సుమంత్.

ఒక్కో కిడ్నీ మార్పిడికి రూ.55 లక్షలు వసూలు..
బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ నేతృత్వంలో ముఠా ఏర్పాటు చేసుకుని ఒక్కో కిడ్నీ మార్పిడికి 55 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఇతర రాష్ట్రాల కిడ్నీ పేషెంట్లకు అలకనంద ఆసుపత్రిలో ట్రాన్స్ ప్లాంటేషన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. బ్రోకర్స్ ద్వారా డోనర్స్ ని ట్రాప్ చేసి హైదరాబాద్ తీసుకొస్తున్న ముఠా.. ఒక్కో డోనర్ కు 4 నుంచి 5 లక్షల రూపాయలు ఇచ్చి కిడ్నీని కొట్టేసింది.

Also Read : ఇదెక్కడి బాధరా బాబూ.. సెకండ్ సిమ్‌కి నెలనెలా రీచార్జ్ చేయాల్సి వస్తుందనుకుంటున్నారా?.. బీఎస్ఎన్ఎల్ ఖతర్నాక్ రీచార్జ్ ప్లాన్..

ప్రధాన నిందితుడి కోసం పోలీసుల వేట..
కిడ్నీ మార్పిడి ఆపరేషన్ల గురించి ఆసుపత్రి సిబ్బందికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉజ్బెకిస్తాన్ లో ఎంబీబీఎస్ చదివాడు డాక్టర్ సుమంత్. బెంగళూరుకు చెందిన ప్రధాన నిందితుడైన డాక్టర్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కిడ్నీ సర్జరీలు చేసే ఫ్లోర్ కి కొంతమంది సిబ్బందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈ ఘటనలో నలుగురు పేషెంట్స్ ను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు అధికారులు.

గుట్టుచప్పుడు కాకుండా.. ఆసుపత్రి సిబ్బందికి కూడా తెలియకుండా ఆపరేషన్లు..
కిడ్నీ రాకెట్ దందా కేసులో 8మంది మధ్యవర్తుల పాత్ర ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సాధారణ ఆసుపత్రికి అనుమతులు తీసుకుని గుట్టు చప్పుడు కాకుండా కిడ్నీ మార్పిడి దందా చేస్తున్నట్లుగా బయటపడింది. డాక్టర్ సుమంత్ మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని అమాయకులను తీసుకొచ్చి వారికి ఎంతో కొంత ముట్టజెప్పి వారి వద్ద నుంచి కిడ్నీ తీసుకుని.. అది అవసరమైన వారికి పెద్ద మొత్తానికి అమ్ముకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

సుమంత్ ను పోలీసులు అనేక కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. సుమంత్ కి సహకరించిన వైద్యుడే ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. అతడే, ఈ అలకనంద ఆసుపత్రిలో గుట్టు చప్పుడు కాకుండా ఆసుపత్రిలో పని చేస్తున్న సిబ్బందికి తెలియకుండా, చాలా సీక్రెట్ గా, ప్లాన్ ప్రకారం కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లుగా విచారణలో వెలుగుచూసింది.

Also Read : ఎంత పక్కాగా ప్లాన్ చేసినా ఇక్కడ దొరికిపోయాడు.. మీర్ పేట్ మాధవి కేసులో ఆధారాలు దొరికేశాయ్