ప్రైవేట్ స్కూల్స్‌లో యూనిఫాం, షూస్ అమ్మకాలపై హైదరాబాద్‌లో నిషేధం
పుస్తకాలు వంటివి మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద అమ్ముకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది.

Private schools
Hyderabad Private Schools: చదువుకోవడానికి పిల్లలను బడులకు పంపుతుంటాం. చదువు మాత్రమే చెప్పడం కాకుండా అనేక పాఠశాలల యాజమాన్యాలు యూనిఫాం, షూస్, బెల్ట్‌ల బిజినెస్ కూడా చేస్తుంటాయి. తమ దగ్గరే వాటిని కొనాలని, ఇతర దుకాణాల్లో కొనుకుంటే ఒప్పుకోబోమని బెదిరిస్తుంటాయి.
హైదరాబాద్‌లో ఈ ధోరణి అధికంగా కనపడుతుంది. ఇకపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అటువంటి ఇబ్బందులు లేకుండా హైదరాబాద్ డీఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రైవేట్ స్కూల్స్‌లో యూనిఫాం, షూస్ అమ్మడంపై నిషేధం విధించారు.
హైదరాబాద్ ప్రైవేట్ స్కూల్స్ (రాష్ట్ర, సీబీఎస్సీ, ఐసీఎస్ఈ)లో యూనిఫాం, షూస్, బెల్ట్‌లను అమ్మడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్టేషనరీ పుస్తకాలు వంటివి మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద అమ్ముకోవచ్చని ఆదేశాలు జారీ అయ్యాయి.
Also Read: రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ముగ్గురు నీటి పారుదల శాఖ ఇంజనీర్లు, ఓ సర్వేయర్