free water scheme : ఉచిత వాటర్ స్కీమ్ పై ఆసక్తిచూపని నగరవాసులు.. కారణాలేంటి?

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి సరఫరా ప్రారంభమైంది. ఉచిత వాటర్‌పై ప్రజలకు ఆసక్తి లేదని తెలుస్తోంది. అందుకు కారణాలేంటి?

free water scheme : ఉచిత వాటర్ స్కీమ్ పై ఆసక్తిచూపని నగరవాసులు.. కారణాలేంటి?

Free Water Scheme

Updated On : March 30, 2021 / 1:19 PM IST

uninterested on free water scheme : గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి సరఫరా ప్రారంభమైంది. ప్రతీ కనెక్షన్‌కు మీటర్ ఏర్పాటు చేసుకోవాలి.. లేకుంటే పథకం వర్తించదు. జనవరిలో స్కీమ్‌ ప్రారంభమైనా.. కనీసం నలబై శాతం కూడా దరఖాస్తులు రాలేదు. దీంతో.. ఉచిత వాటర్‌పై ప్రజలకు ఆసక్తి లేదని తెలుస్తోంది. అందుకు కారణాలేంటి? గ్రేటర్‌ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం ఉచిత తాగునీటి పథకాన్ని ప్రారంభించింది. జనవరిలో మంత్రి కేటీఆర్ కొంతమంది లబ్ధిదారులకు జీరో బిల్లును అందించారు.

కుటుంబానికి 20వేల లీటర్ల తాగునీరు అందించే ఈ పథకంలో.. ప్రతీ ఒక్కరు ఆధార్ కార్డును అనుసంధానించాలి. మీటర్లు ఏర్పాటు చేసుకుంటేనే పథకం అమలవుతోందని వాటర్ బోర్డు కూడా ప్రకటన విడుదల చేసింది. అయితే.. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. నగరంలో పది లక్షల వాటర్ కనెక్షన్లుంటే రెండున్నర లక్షల మందికి మాత్రమే నల్లా మీటర్లున్నాయ్‌. అందులోనూ ముప్పై శాతం పని చేయడం లేదు. ఇప్పుడు ఉచిత తాగునీటి పథకం కావాలంటే వారంతా మీటర్లను బిగించుకోవాల్సిందే.

ఆధార్ యాక్ట్ సెక్షన్ 9 ప్రకారం.. ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరాలంటే ప్రతీ ఇంటి వాటర్ కన్జుమర్ నెంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయాలి. ఆధార్‌తో పాటు బ్యాంక్‌ పాస్‌బుక్‌, పాన్ కార్డ్‌, పాస్‌పోర్ట్‌, రేషన్ కార్డ్, ఓటరు కార్డుల వంటి ఫోటో ఐడెంటిటీ కార్డులను జత చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం.. ప్రతీ ఇంటికి 20వేల లీటర్ల వరకూ ఉచితంగా అందనుంది. అంతకు మించి నీటిని వినియోగిస్తే.. వాటర్‌ బోర్డు రేట్లకు అనుగుణంగా బిల్లు చెల్లించాలి. మీసేవా కేంద్రం ద్వారా.. వాటర్‌ క్యాన్‌ నెంబర్‌తో అనుసంధానించాల్సి ఉండగా.. పేరులో మార్పుల వల్ల దాన్ని సిస్టమ్‌ అంగీకరించడం లేదు.

డొమెస్టిక్‌ కేటగిరిలో ఇప్పటివరకూ దాదాపు 8 లక్షల కనెక్షన్లుండగా.. లక్షా యాబై వేల కనెక్షన్లకు మాత్రమే ఆధార్ లింక్‌ అయ్యింది. బల్క్‌ కేటగిరిలో 22 వేల కనెక్షన్లు ఉంటే.. 16వందల కనెక్షన్లు మాత్రమే ఆధార్‌తో లింక్‌ అయ్యాయ్‌. దీంతో.. సిటీలో ఉన్న ఆధార్ అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేయాలని డిసైడ్ అయ్యింది జలమండలి. అందుకోసం ఐదు వందల టీమ్‌లను రంగంలోకి దించుతున్నారు అధికారులు.

ఏప్రిల్ 10వరకూ డొమెస్టిక్ వినియోగదారుల ప్రక్రియ పూర్తి చేసి.. ఆ తర్వాత బల్క్‌ కనెక్షన్ల వినియోగదారులకు ఆధార్ అనుంసంధాన ప్రక్రియ చేపట్టాలని జలమండలి టార్గెట్‌గా పెట్టుకుంది. ప్రస్తుతం ఇప్పటికిప్పుడు వినియోగదారులు నల్లా మీటర్లు బిగించుకోవడం ఆర్ధిక భారంతో కూడుకున్న పని. ఒకటికంటే ఎక్కువ ఇళ్లు ఉన్నవారు ఆధార్ అనుసంధానికి ముందుకు రావడం లేదు. మరోవైపు టెక్నికల్ ఇబ్బందులు ఎలాగూ ఉన్నాయి.