Hyderabad : హైదరాబాద్‌లో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్.. ప్రారంభం ఎప్పుడంటే..? ప్రతిరోజూ 25వేల మందికి

Hyderabad : హైదరాబాద్‌లో రూ.5కే టిఫిన్ అందించేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కీంను ప్రారంభిస్తారు.

Hyderabad : హైదరాబాద్‌లో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్.. ప్రారంభం ఎప్పుడంటే..? ప్రతిరోజూ 25వేల మందికి

Hyderabad

Updated On : September 15, 2025 / 9:46 AM IST

Hyderabad Breakfast Scheme : హైదరాబాద్‌లో రూ.5కే టిఫిన్ అందించేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. హరేకృష్ణ ఫౌండేషన్ ద్వారా ఈ టిఫిన్ అందించనున్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లలో త్వరలో ఈ బ్రేక్ ఫాస్ట్‌ను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు.

Also Read: ఆ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారా? లేరా? టీపీసీసీ చీఫ్ ఏమన్నారంటే?

హైదరాబాద్‌లో పేదవాళ్ల ఆకలి తీర్చేందుకు రూ.5 భోజన కార్యక్రమం 2013లో మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జీహెచ్ఎంసీ పరిధిలోని రూ.5కే భోజనం అందిస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్ల స్టాల్స్‌ను అధికారులు కొత్తగా మారుస్తున్నారు. ప్రస్తుతం 139 చోట్ల ఈ స్టాల్స్ ఉండగా.. వీటి సంఖ్యను 150కు పెంచారు. చాలా ఏళ్లుగా ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేయడంతో కొన్ని డ్యామేజ్ అయ్యాయి. మరికొన్నిచోట్ల పూర్తిగా పాడై వినియోగించేందుకు వీలులేకుండా పోయాయి. దీంతో వీటి స్థానంలో రూ.11.43 కోట్లతో బల్దియా కొత్త వాటిని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 60 చోట్ల స్టాల్స్ ఏర్పాటు చేయగా.. గతంలో ఉన్న సైజుతో పోలిస్తే మూడింతలు ఎక్కువ స్పేస్ తో వీటిని ఏర్పాటు చేస్తున్నారు.

హరేరామ హరే కృష్ణ మూవ్‌మెంట్‌తో కలిసి ప్రభుత్వం రూ.5కే నాణ్యమైన, పౌష్టికరమైన భోజనాన్ని అందిస్తుంది. అయితే, జీహెచ్ఎంసీ త్వరలో ఈ ఇందిరమ్మ క్యాంటీన్లలో రూ.5కే బ్రేక్ ఫాస్ట్ స్కీం ను అందుబాటులోకి తేనున్నారు. ఒక్క బ్రేక్ ఫాస్ట్ కు రూ. 19 ఖర్చు అవుతుండగా.. ఇందులో రూ.5 ప్రజల నుంచి తీసుకుంటారు. ఇక జీహెచ్ఎంసీ రూ.14 భరించనుంది. ఈ పథకాన్ని ఈ నెలాఖరులోపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు.

ఇందిరమ్మ క్యాంటీన్లలో త్వరలో అందుబాటులోకి బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ రానుంది. ఈ స్కీంలో భాగంగా ఒక్కో రోజు ఒక వెరైటీ టిఫిన్ పెట్టాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజులకు ఆరు రకాల పౌష్టికమైన టిఫిన్స్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ మెనూ సిద్ధం చేసింది. ఇండ్లీ, పొంగల్, పూరి, ఉప్మా వంటి అల్పాహారాలు ఇందులో ఉన్నాయి. ఇప్పటికే ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం అందిస్తుండగా.. రూ.5కే బ్రేక్ ఫాస్ట్ స్కీం అందుబాటులోకి వస్తే బస్తీ వాసులు, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ నగరంలో రోజుకు 25వేల మందికి బ్రేక్ ఫాస్ట్ అందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.