Hydraa Toll Free Number: హైడ్రా టోల్ ఫ్రీ నెంబర్ ఇదే.. కబ్జాలపై ఫిర్యాదులు, అత్యవసర సేవల కోసం కాల్ చేయొచ్చు..

చెరువులు, నాలాలు, పార్కులు, ప్ర‌భుత్వ భూములు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాలు క‌బ్జాకు గురైతే వెంట‌నే టోల్‌ఫ్రీ నెంబర్ కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వొచ్చన్నారు.

Hydraa Toll Free Number: హైడ్రా టోల్ ఫ్రీ నెంబర్ ఇదే.. కబ్జాలపై ఫిర్యాదులు, అత్యవసర సేవల కోసం కాల్ చేయొచ్చు..

Updated On : September 2, 2025 / 4:30 PM IST

Hydraa Toll Free Number: హైడ్రాకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి వచ్చింది. ఫిర్యాదులు స్వీక‌రించ‌డానికి టోల్‌ ఫ్రీ నెంబర్ 1070 తీసుకొచ్చింది. ప్రజలు 1070 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదులు చేయ‌వ‌చ్చని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ తెలిపారు.

చెరువులు, నాలాలు, పార్కులు, ప్ర‌భుత్వ భూములు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాలు క‌బ్జాకు గురైతే వెంట‌నే టోల్‌ఫ్రీ నెంబర్ కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వొచ్చన్నారు. అంతేకాదు ప్ర‌కృతి వైప‌రిత్యాలు సంభ‌వించిన‌ప్పుడు.. అంటే.. చెట్లు ప‌డిపోయినా, వ‌ర‌ద ముంచెత్తినా, అగ్ని ప్ర‌మాదాలు జ‌రిగినా ఇలా ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిస్థితులున్న‌ప్పుడు హైడ్రా సేవ‌ల‌ కోసం ఈ టోల్ ఫ్రీ నెంబర్ 1070కి కాల్ చేయొచ్చన్నారు.

ఓఆర్ఆర్ ప‌రిధిలో ప్ర‌భుత్వ, ప్ర‌జా ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ‌కు 8712406899 నెంబర్ సైతం స‌మాచారం ఇవ్వొచ్చు. వాట్సాప్ ద్వారా ఫిర్యాదుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పంపించ‌వ‌చ్చని అధికారులు తెలిపారు. ప్ర‌కృతి వైప‌రిత్యాలు సంభ‌వించిన‌ప్పుడు, భారీ వ‌ర్షాలు ప‌డి కాల‌నీలు, ర‌హ‌దారులు నీట మునిగినా, అగ్ని ప్ర‌మాదం జ‌రిగినా వెంట‌నే 8712406901, 9000113667 నెంబర్లకు ఫోన్ చేయవచ్చని అధికారులు వెల్లడించారు.

Also Read: బీఆర్ఎస్ అధిష్టానం సంచలన నిర్ణయం.. ఎమ్మెల్సీ కవితపై సస్పెన్షన్ వేటు