Addanki Dayakar : అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తున్నా.. శామ్యూల్ ను గెలిపించి రేవంత్, సోనియాకు గిఫ్ట్ ఇస్తా : అద్దంకి దయాకర్
హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గౌరవిస్తున్నానని చెప్పారు. మందుల శామ్యూల్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ప్రచారం కూడా చేస్తానని చెప్పారు.

Addanki Dayakar
Addanki Dayakar – Thungathurthi Ticket : అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. తుంగతుర్తి టికెట్ ను దయాకర్ కు కాకుండా శామ్యూల్ కు కేటాయించింది. తనకు టికెట్ కేటాయించకపోవడం పట్ల దయాకర్ స్పందించారు. తుంగతుర్తి విషయంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని తెలిపారు. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం తనకు శిరోధార్యం అన్నారు.
హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గౌరవిస్తున్నానని చెప్పారు. మందుల శామ్యూల్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ప్రచారం కూడా చేస్తానని చెప్పారు. తుంగతుర్తిలో శ్యామూల్ ను గెలిపించి రేవంత్ రెడ్డి, సోనియాగాంధీకి గిఫ్ట్ ఇస్తానని స్పష్టం చేశారు.
Patel Ramesh Reddy : కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో.. బోరున విలపించిన పటేల్ రమేష్ రెడ్డి, కుటుంబసభ్యులు
పార్టీకి ఇబ్బందికరమైన కామెంట్స్ ఏ ఒక్కరూ చేయకూడదని సూచించారు. కాగా, తుంగతుర్తి సీటుపై అద్దంకి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తుంగుర్తి టికెట్ తనకే ఇస్తారని చివరి వరకు ఆశించారు. కానీ, కాంగ్రెస్ హైకమాండ్ దయాకర్ కు షాక్ ఇచ్చింది. తుంగతుర్తి టికెట్ ను దయాకర్ కు కాకుండా శామ్యూల్ కు కేటాయించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గురువారం కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ విడుదల చేసింది. పెండింగ్ లో ఉన్న నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతోపాటు పఠాన్ చెరు అభ్యర్థిని మార్చింది. పఠాన్ చెరు టికెట్ ను గతంలో నీలం మధుకు కేటాయించిన కాంగ్రెస్.. ఆయన స్థానంలో కట్టా శ్రీనివాస్ గౌడ్ కు ఇచ్చింది.
Congress Final List : కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ విడుదల.. అద్దంకి దయాకర్‌కు హ్యాండ్, నీలం మధుకు షాక్
ఇక సూర్యపేట టికెట్ ను పటేల్ రమేష్ రెడ్డికి కాకుండా రాంరెడ్డి దామోదర్ రెడ్డికి కేటాయించింది. దీంతో రమేష్ రెడ్డి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. టికెట్ దక్కకపోవడంతో రమేష్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు బోరును విలపిస్తున్నారు.