Congress Final List : కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ విడుదల.. అద్దంకి దయాకర్‌కు హ్యాండ్, నీలం మధుకు షాక్
Congress Release Final List : పటాన్ చెరు టికెట్ ను గతంలో నీలం మధుకు కేటాయించిన కాంగ్రెస్.. ఆయన స్థానంలో ఆ టికెట్ ను కాట శ్రీనివాస్ గౌడ్ కు ఇచ్చింది. ఇక సూర్యాపేట టికెట్ ను రాంరెడ్డి దామోదర్ రెడ్డికే ఇచ్చింది.

Telangana Congress Release Final List
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తన తుది జాబితాను విడుదల చేసింది. పెండింగ్ లో ఉన్న నాలుగు స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించడంతో పాటు పఠాన్ చెరు అభ్యర్థిని మార్చింది. పటాన్ చెరు టికెట్ ను గతంలో నీలం మధుకు కేటాయించిన కాంగ్రెస్.. ఆయన స్థానంలో ఆ టికెట్ ను కట్టా శ్రీనివాస్ గౌడ్ కు ఇచ్చింది. ఇక సూర్యాపేట టికెట్ ను రాంరెడ్డి దామోదర్ రెడ్డికే ఇచ్చింది.
కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ :
పటాన్ చెరు – కట్టా శ్రీనివాస్ గౌడ్
చార్మినార్ – మహ్మద్ ముజీబ్ ఉల్లా షరీఫ్
మిర్యాలగూడ – బత్తుల లక్ష్మా రెడ్డి
సూర్యాపేట – రాంరెడ్డి దామోదర్ రెడ్డి
తుంగతుర్తి (ఎస్సీ) – మందుల శామ్యూల్
Also Read : నేను జైలుకెళ్లడానికి అతడే కారణం, శత్రువులతో చేతులు కలిపి- రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
కాగా, అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ హైకమాండ్ బిగ్ షాక్ ఇచ్చింది. తుంగతుర్తి సీటుపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తుంగతుర్తి టికెట్ తనకే ఇస్తారని చివరి నిమిషం వరకు ఆశించారు. కానీ, కాంగ్రెస్ పెద్దలు అద్దంకి దయాకర్ కు హ్యాండ్ ఇచ్చారు. తుంగతుర్తి టికెట్ ను శామ్యూల్ కు కేటాయిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు మూడు స్థానాల విషయంలో ఎట్టకేలకు ప్రతిష్ఠంభన తొలగింది. మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి టికెట్లు ఖరారు చేసింది. ఆ మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్.
సూర్యాపేట – రాంరెడ్డి దామోదర్ రెడ్డి
మిర్యాలగూడ – బత్తుల లక్ష్మారెడ్డి
తుంగతుర్తి – మందుల శామ్యూల్
కాగా, ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులుగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. రేపు సంబంధిత ఆర్వోకు వారిద్దరూ పార్టీ బీ ఫార్మ్ ను అందజేయనున్నారు.
Also Read : మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా ఎక్కువ రోజులు ఉండదు- బాంబు పేల్చిన బండి సంజయ్