మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా ఎక్కువ రోజులు ఉండదు- బాంబు పేల్చిన బండి సంజయ్
Bandi Sanjay Sensational Comments : కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు కేసీఆర్ రెడీగా ఉన్నారు. ఎక్కడైనా దోస్తులకు టికెట్ ఇస్తారా? ప్రజల్లో ఉండే వ్యక్తులకు టికెట్లు ఇవ్వాలి.

Bandi Sanjay Sensational Comments (Photo : Facebook)
మంచిర్యాల జిల్లా జన్నారంలో బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. బండి సంజయ్ ని చూడగానే కొందరు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. మీరంతా సీఎం సీఎం అని నా ఉన్న పదవి కూడా పోగొట్టారు అని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీజేపీనే ఉందన్న బండి సంజయ్ మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రాదని జోస్యం చెప్పారు. ఒకవేళ వచ్చినా ఆ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని బాంబు పేల్చారు.

Bandi Sanjay (Photo : Facebook)
కల్వకుంట్ల కుటుంబ సభ్యులే ప్రభుత్వాన్ని కూలగొడతారు..
”కల్వకుంట్ల కుటుంబ సభ్యులే ప్రభుత్వాన్ని కూలగొడతారు, మళ్ళీ ఎన్నికలు వస్తాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి, రాజగోపాల్, భట్టీ విక్రమార్క సీఎం పదవి కోసం ప్రభుత్వాన్ని పడగొడతారు. కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు కేసీఆర్ రెడీగా ఉన్నారు. ఎక్కడైనా దోస్తులకు టికెట్ ఇస్తారా? ప్రజల్లో ఉండే వ్యక్తులకు టికెట్లు ఇవ్వాలి.
Also Read : త్వరలో పెన్షన్ రూ.5వేలకు పెంపు, ఇకపై వారందరికి కూడా అమలు- సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్
కేటీఆర్..లక్ష కోట్లు ఎలా సంపాదించావు?
ఖానాపూర్ లో జాన్సన్ గెలిస్తే.. ఆయనను కలవడానికి అందరూ పాస్ పోర్టులు తీసుకోవాలి. కేసీఆర్ అనే సీఎం లేకపోతే కేటీఆర్ ది బిచ్చపు బతుకే. కేసీఆర్ కుటుంబం బండారం బయటపెట్టే వరకు విడిచిపెట్టను. నెలకు కోటి రూపాయల ఉద్యోగం వదిలేసి వచ్చిన కేటీఆర్.. లక్షల కోట్లు ఎలా సంపాదించావు? కేసీఆర్ 5లక్షల కోట్ల అప్పు చేశారు, ఒక్కొక్కరి పేరు మీద లక్ష 20వేల అప్పు చేశారు. నెలనెల జీతాలు ఇవ్వాలంటే జాగాలు అమ్ముతున్నారు. మద్యం షాపులు పెంచుతున్నారు. అప్పులు తెస్తున్నారు.

CM KCR (Photo : Facebook)
పోడు భూముల పేరుతో చిచ్చు..
పోడు భూముల పేరిట ఏజెన్సీలోని గిరిజనులు-గిరిజనేతరులకు మధ్య చిచ్చు పెడుతున్నారు. పోడు భూముల కోసం కొట్లాడితే బీజేపీ కార్యకర్తలపై దాడులు చేశారు. జైల్లో పెట్టించారు. రైతు పండించిన ప్రతి గింజను కేంద్రం కొనుగోలు చేస్తుంది. ధర్మం కావాలా? రాజకీయం కావాలా? అంటే ధర్మమే కావాలంటా.
Also Read : మంత్రి హరీష్ రావు మీద రెండు క్రిమినల్ కేసులు, 11 కోట్ల అప్పు, 24 కోట్ల ఆస్తులు
కాంగ్రెస్ కి ఓటు వేస్తే అమ్ముడుపోవడం ఖాయం..
కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు తెలంగాణకు దరిద్రంలాగా దాపురించాయి. కాంగ్రెస్ కి ఓటు వేస్తే బీఆర్ఎస్ కు అమ్ముడుపోవడం ఖాయం. నేను చావుకి భయపడను. చావే నన్ను చూసి భయపడింది. తెలంగాణలో 80శాతం ఉన్న హిందువులు ఏకమైతే రామరాజ్యం రావడం ఖాయం.
ఖానాపూర్ లో రాథోడ్ రమేష్ గెలుపు పక్కా” అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

Bandi Sanjay Sensational Comments (Photo : Google)