CM KCR : త్వరలో పెన్షన్ రూ.5వేలకు పెంపు, ఇకపై వారందరికి కూడా అమలు- సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్

CM KCR Speech In Kamareddy : రూ.50లక్షలతో అడ్డంగా దొరికిన రేవంత్ ను పోటీకి పెడతారా? ఎవరిని గెలిపిస్తారో ప్రజలు ఆలోచించాలి.

CM KCR : త్వరలో పెన్షన్ రూ.5వేలకు పెంపు, ఇకపై వారందరికి కూడా అమలు- సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్

CM KCR Speech In Kamareddy

Updated On : November 9, 2023 / 7:35 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కామారెడ్డిలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది కామారెడ్డి ప్రాంతం అని కేసీఆర్ చెప్పారు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారని, కానీ ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే బీడీ కార్మికులకు పెన్షన్‌ ఇస్తోందని కేసీఆర్ తెలిపారు. కామారెడ్డిలో నామినేషన్‌ వేసిన కేసీఆర్.. ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు.

అందుకే కామారెడ్డి నుంచి పోటీ.. విచక్షణతో ఓటేయాలి
”తెలంగాణ కోసం బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. కామారెడ్డి నుంచి పోటీ చేయాలని గంప గోవర్ధన్ చాలాసార్లు అడిగారు. నియోజకవర్గంలోని పల్లెలను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. అందుకే నేను కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నా. రెండేళ్లలో కాళేశ్వరం పెండింగ్ పనులు పూర్తి చేస్తాం. కామారెడ్డి ఎల్లారెడ్డికి సాగునీరు అందిస్తాం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఆయుధం ఓటు. విచక్షణతో ఓటేయాలి.

CM KCR

CM KCr (Photo : Facebook)

రూ.50లక్షలతో అడ్డంగా దొరికిన రేవంత్ ను పోటీకి పెడతారా?
50ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ఏం చేసింది? కాంగ్రెస్ పాలనలో దళితులు అణిచివేతకు గురయ్యారు. నెహ్రు హయాంలో దళితబంధు పెట్టి ఉంటే దళితులు అభివృద్ది చెందేవారు. రైతుబంధు దుబారా అనే పార్టీలకు ఓటేస్తారా? ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఓటెయొద్దు. రూ.50లక్షలతో అడ్డంగా దొరికిన రేవంత్ ను పోటీకి పెడతారా? ఎవరిని గెలిపిస్తారో ప్రజలు ఆలోచించాలి.

Also Read.. కేటీఆర్ కు తృటిలో తప్పిన ప్రమాదం

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఇస్తున్నాం..
16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. ఒక్క తెలంగాణలో తప్ప ఏ రాష్ట్రంలోనూ బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వడం లేదు. ఇప్పటిదాకా 2014 ఏడాదికంటే ముందే బీడీ కార్మికులుగా ఉన్న వాళ్లకు మాత్రమే పెన్షన్లు ఇస్తున్నాం. 2014 తర్వాత బీడీ కార్మికులుగా మారిన వాళ్లకు పెన్షన్లు రావడం లేదు. అందుకే కొత్త బీడీ కార్మికులకు కూడా ఫించన్ ఇవ్వాలనే విషయాన్ని మా ఎమ్మెల్యేలు నా దృష్టికి తెచ్చారు.

CM KCR

CM KCR (Photo : Facebook)

పెన్షన్ రూ.5వేలకు పెంపు..
ఎన్నికల తర్వాత పాత, కొత్త తేడా లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీడీ కార్మికుడికి పెన్షన్‌ వస్తుంది. బీడీ కార్మికులకు ఆదాయం తక్కువ. అందుకే ఈ సాయం చేస్తున్నాం. మానవతా దృక్పథంతో పెన్షన్ ఇస్తున్నాం. అందరితో పాటు సమానంగా బీడీ కార్మికులకూ ఇస్తున్నాం. త్వరలో పెన్షన్ 5వేలకు పెంచుతాం. బీడీ కార్మికులకు కూడా 5వేలకు పెరుగుతుంది. కొత్త బీడీ కార్మికులు లక్షమంది ఉండొచ్చు. ఎన్నికల తర్వాత ఆ లక్షమంది కొత్త బీడీ కార్మికులకూ పింఛన్ మంజూరు చేస్తాం” అని హామీ ఇచ్చారు కేసీఆర్

Also Read : తెలంగాణలో రాజకీయాలు చేస్తే తరిమికొడతాం… పవన్ కళ్యాణ్ కు ఓయూ విద్యార్థులు సీరియస్ వార్నింగ్

మరోవైపు అధికార బీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. పలు పార్టీలకు చెందిన నాయకులు ఇప్పటికే గులాబీ కండువా కప్పుకున్నారు. తాజాగా సీనియర్ యాక్టర్ గౌతమ్ రాజ్ బీఆర్ఎస్ లో చేరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నివాసంలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.