Patel Ramesh Reddy : కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో.. బోరున విలపించిన పటేల్ రమేష్ రెడ్డి, కుటుంబసభ్యులు
రమేష్ రెడ్డి సూర్యపేట కాంగ్రెస్ టికెట్ ఆశించారు. అయితే ఈసారి కచ్చితంగా తనకు టికెట్ ఇస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, రమేష్ రెడ్డి ఆశలపై కాంగ్రెస్ అధిష్టానం నీళ్లు చల్లింది.

Patel Ramesh Reddy (1)
Patel Ramesh Reddy Lamented : సూర్యపేట కాంగ్రెస్ టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డికి మరోసారి నిరాశే ఎదురైంది. పటేల్ రమేష్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ దక్కలేదు. కాంగ్రెస్ అధిష్టానం మరోసారి ఆయనకు మొండి చేయి చూపించింది. రమేష్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోవడంతో పటేల్ రమేష్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. గత ఎన్నికల్లోనూ రమేష్ రెడ్డి నిరాశ కలిగింది.
రమేష్ రెడ్డి సూర్యపేట కాంగ్రెస్ టికెట్ ఆశించారు. అయితే ఈసారి కచ్చితంగా తనకు టికెట్ ఇస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, రమేష్ రెడ్డి ఆశలపై కాంగ్రెస్ అధిష్టానం నీళ్లు చల్లింది. ఈ సారి కూడా ఆయనకు టికెట్ కేటాయించలేదు. సూర్యపేట కాంగ్రెస్ టికెట్ పటేల్ రమేష్ రెడ్డికి కాకుండా రాంరెడ్డి దామోదర్ రెడ్డికి కేటాయించారు. దీంతో రమేష్ రెడ్డి తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
Congress Final List : కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ విడుదల.. అద్దంకి దయాకర్‌కు హ్యాండ్, నీలం మధుకు షాక్
మరోవైపు రమేష్ రెడ్డికి టికెట్ రాకపోవడాన్ని నిరసిస్తూ ఆయన అనుచరులు అర్ధరాత్రి విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పార్టీ కోసం ఎంతో కష్టపడితే మాట ఇచ్చి తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గురువారం కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ విడుదల చేసింది. పెండింగ్ లో ఉన్న నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతోపాటు పఠాన్ చెరు అభ్యర్థిని మార్చింది.
పఠాన్ చెరు టికెట్ ను గతంలో నీలం మధుకు కేటాయించిన కాంగ్రెస్.. ఆయన స్థానంలో కట్టా శ్రీనివాస్ గౌడ్ కు ఇచ్చింది. ఇక సూర్యపేట టికెట్ ను రాంరెడ్డి దామోదర్ రెడ్డికి ఇచ్చింది. మరోవైపు అద్దంకి దయాకర్ కు అధిష్టానం షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు.తుంగతుర్తి సీటుపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
Ambati Rambabu : వంద మంది చంద్రబాబులు, పవన్ కళ్యాణ్ లు కలిసొచ్చినా గెలిచేది జగనే : మంత్రి అంబటి
తుంగతుర్తి టికెట్ తనకే ఇస్తారని ఆశించారు. కానీ, కాంగ్రెస్ హైకమాండ్ దయాకర్ కు మొండి చూపించింది. తుంగతుర్తి టికెట్ ను దయాకర్ కు కాకుండా శామ్యూల్ కు కేటాయించింది. దీందో దయాకర్ తీవ్ర నిరాశ చెందినట్లు తెలుస్తోంది.