పోలీసులకు సినిమా చూపిస్తున్న ఐబొమ్మ రవి.. ఏం అడిగినా.. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా.. ఇంకా అడిగితే..
రవి అకౌంట్ల చిట్టా ఇవ్వాలని పలు బ్యాంకులకు మెయిల్ చేశారు పోలీసులు.
Ibomma Ravi: ఐబొమ్మ రవి తీరులో మార్పు లేదు. మూడో రోజు విచారణలోనూ అదే వైఖరి ప్రదర్శించాడు. నాకు ఏమీ తెలీదు, మర్చిపోయా.. ఇది తప్ప రవి నోటి నుంచి మరో పదం రాలేదు. ఐబొమ్మ రవి మూడో రోజు విచారణ ముగిసింది. విచారణకు రవి ఏమాత్రం సహకరించ లేదని పోలీసులు తెలిపారు. ఇమ్మడి రవి పొంతన లేని సమాధానాలు చెపినట్లు సమాచారం.
యూజర్ ఐడీ, పాస్ వర్డ్ లు అడిగితే.. గుర్తు లేదు, మరిచిపోయా అని సమాధానం ఇచ్చాడట. దీంతో ఎథికల్ హ్యాకర్ల సాయంతో హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్ లు ఓపెన్ చేస్తున్నారు పోలీసులు. ఫ్రాన్స్, నెదర్లాండ్స్ లో మెయిన్ సర్వర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇక, బ్యాంక్ ఖాతాల వివరాలపైనా రవి నోరు విప్పలేదు. రవి అకౌంట్ల చిట్టా ఇవ్వాలని పలు బ్యాంకులకు మెయిల్ చేశారు పోలీసులు.
ఇమ్మడి రవి ప్రతీ 20 రోజులకు ఒక్కో దేశానికి వెళ్తున్నారు గుర్తించారు పోలీసులు. విదేశీ పర్యటనలు అంటే ఇష్టం ఉండటం వల్లే వెళ్ళాను అని రవి చెప్పాడట. రవి విజిట్ చేసిన దేశాల్లో ఉన్న పైరసీ లింకుల కూపీ లాగుతున్నారు పోలీసులు.
ఇక మూడో రోజు కస్టడీలో ఐబొమ్మ రవిని స్వయంగా విచారించారు సీపీ సజ్జనార్. సైబర్ క్రైమ్ ఆఫీస్ కు వెళ్లిన సజ్జనార్.. రవిని విచారించారు. అనంతరం రవిని బషీర్ బాగ్ లోని సీపీ సజ్జనార్ ఛాంబర్ కు తీసుకెళ్లారు పోలీసులు.
పైరసీ పిన్ కింగ్ ఐబొమ్మ రవిని ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించగా.. ఇవాళ మూడో రోజు విచారణ ముగిసింది. ఏజెంట్లు, గేమింగ్ యాప్‌ల నిర్వాహకులతో ఉన్న సంబంధాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరెవరు సహకరిస్తున్నారు, తెర వెనుక ఇంకెంతమంది ఉన్నారనే విషయాలపై ప్రశ్నించారట. సినిమాలు ఎలా సేకరిస్తారు, సైట్లలో ఏ విధంగా అప్‌లోడ్ చేస్తారు అనేదానికి సంబంధించిన పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారని సమాచారం.
Also Read: మరోసారి సీఎం రేవంత్-అల్లు అర్జున్ ఒకే స్టేజిపై.. ఆ హీరో కోసం..
