చచ్చిపోతే..ప్రభుత్వం చదివిస్తుందని తండ్రి ఆత్మహత్యాయత్నం

  • Published By: madhu ,Published On : September 11, 2020 / 07:11 AM IST
చచ్చిపోతే..ప్రభుత్వం చదివిస్తుందని తండ్రి ఆత్మహత్యాయత్నం

Updated On : September 11, 2020 / 10:38 AM IST

హైదరాబాద్ లోని రవీంద్ర భారతి వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. తాను చనిపోతే..పిల్లలను ప్రభుత్వం చదివిస్తుందని భావించే అతను ఆత్మహత్యకు ప్రయత్నించాడని తేలింది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ జిల్లాకు చెందిన నాగులు (55) తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు.




పంజాగుట్ట ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, రాకేశ్, స్నేహలత పిల్లలున్నారు. వీరు డిగ్రీ చదువుతున్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించలేక పోతున్నానని దిగాలు చెందే వాడని భార్య వెల్లడించింది. ఈ క్రమంలో..తాను అందరికీ తెలిసే విధంగా..ముఖ్యంగా ప్రభుత్వానికి తెలిసే విధంగా..ఆత్మహత్య చేసుకుంటే..బాగుంటుందని నాగులు భావించాడు.
https://10tv.in/tiktok-user-in-love-got-married-committed-suicide-in-guntur-district/
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా..అక్కడనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. పెట్రోల్ బాటిల్ తో అక్కడకు చేరుకున్నాడు. కానీ..పోలీసులు భారీగా ఉండడంతో అక్కడి నుంచి రవీంద్ర భారతి వద్దకు చేరుకున్నాడు. సీసాలోని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.




అనంతరం జై తెలంగాణ, జై కేసీఆర్, ప్రైవేటు టీచర్లకు జీతాల్లేవు అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశాడు. రహదారిపై వెళుతున్న వారు..అక్కడున్న వారు వెంటనే అలర్ట్ అయి..మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే శరీరం కొంత భాగం కాలిపోయింది. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడో..వివరించాడు.




ఇతని శరీరం 63 శాతం కాలిపోయిందని ఉస్మానియా ఆసుపత్రి ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి వెల్లడించారు. నాగులు పరిస్థితిపై మంత్రి ఈటెల స్పందించారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పిల్లల చదువుకు అయ్యే ఖర్చులు భరిస్తామని తెలంగాణ ప్రైవేటు జూనియర్ కళాశాల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌరీ సతీశ్ ప్రకటించారు.