Revanth Reddy : మళ్లీ సీఎంని చేస్తే మరో లక్ష కోట్లు దోచుకుంటారు, రాష్ట్రాన్ని కొల్లగొడతారు- సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి ఒక్క అవకాశం ఇవ్వండి. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చి తెలంగాణ కల సాకారం చేసిన సోనియమ్మ రుణం తీర్చుకుందాం. Revanth Reddy

Revanth Reddy : మళ్లీ సీఎంని చేస్తే మరో లక్ష కోట్లు దోచుకుంటారు, రాష్ట్రాన్ని కొల్లగొడతారు- సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

Revanth Reddy Slams KCR

Updated On : October 31, 2023 / 8:54 PM IST

Revanth Reddy Slams KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మరోసారి కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేస్తే మరో లక్ష కోట్లు దోచుకుంటారని, రాష్ట్రాన్ని కొల్లగొడతారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పాలమూరు ప్రజాభేరి పేరుతో కొల్లాపూర్ లో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

ప్రమాదం అని చెప్పినా రాహుల్ వచ్చారు..
”పేదోళ్ల దేవత ఇందిరమ్మ.. పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఉక్కు మహిళ. చివరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం తపించిన వీర వనిత వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. కొల్లాపూర్ కు ప్రియాంక గాంధీ రావాల్సి ఉండే. అనివార్య కారణాలతో ఆమె పర్యటన రద్దు కావడంతో రాహుల్ గాంధీ మీ కోసం ఇక్కడికొచ్చారు. హెలికాప్టర్ లో వెళ్లడం ప్రమాదమని చెప్పినా మీ కోసం రిస్క్ చేసి రాహుల్ ఇక్కడికు వచ్చారు.

Also Read : టీడీపీకి బిగ్ షాక్.. కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా, చంద్రబాబు పవన్ కల్యాణ్‌పై హాట్ కామెంట్స్

కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి..
కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారు. మూడోసారి సీఎం చేయాలని కేసీఆర్, ఆయన కుటుంబం అడుగుతోంది. ఇంకో లక్ష కోట్లు దోచుకోవడానికా కేసీఆర్ మూడోసారి అధికారం ఇవ్వమంటున్నారు? మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని కొల్లగొడతారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి ఒక్క అవకాశం ఇవ్వండి. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చి తెలంగాణ కల సాకారం చేసిన సోనియమ్మ రుణం తీర్చుకుందాం.

పాలమూరు పసిడి పంటల జిల్లాగా మారాలంటే..
పాలమూరు జిల్లాలో 14 కు 14 గెలిపించాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలపై ఉంది. పాలమూరు పసిడి పంటల జిల్లాగా మారాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. మీ వాడిగా మీ బిడ్డగా అడుగుతున్నా. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నా. సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ప్రతీ ఇంటికి చేరాలి. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయి. కాంగ్రెస్ వస్తే రైతుబంధు రద్దవుతుందని కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ కు అసలు బుద్దుందా? రైతు భరోసా ద్వారా రైతులకు రూ.15వేలు, రైతు కూలీలకు రూ.12వేలు సోనియమ్మ ప్రకటించారు.

Also Read : నేను గెలిస్తే వాళ్ల దోపీడీ ఉండదు.. ఎన్నికల ప్రచారంలో తుమ్మల సంచలన వ్యాఖ్యలు..

ప్రాణాలు ఇవ్వడమే తెలుసు..
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిపై దాడి నెపం కాంగ్రెస్ పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాడులు చేయదలచుకుంటే.. కేసీఆర్, నువ్వు నీ కుటుంబం బయట తిరిగేది కాదు. ప్రాణాలు ఇవ్వడమే కానీ దాడుల సంస్కృతి కాంగ్రెస్ ది కాదు. కాంగ్రెస్ పై నెపం నెట్టి బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది” అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.