Cold Intensity : తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి తీవ్రత.. రాత్రి వేళల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

రాబోయే మూడు రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు, ఆగ్నేయం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని ఐఎండీ తెలిపింది.

Cold Intensity : తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి తీవ్రత.. రాత్రి వేళల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Increasing cold

Updated On : December 17, 2023 / 8:20 AM IST

Telugu States Cold Intensity : తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి వేళల్లోనే కాకుండా పగటి పూట కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరోవైపు రానున్న మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. విపరీతమైన చలితో ప్రజలు వణికిపోతున్నారు. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి.

తెలంగాణలో 2 డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రతలు
తెలంగాణలో చాలా చోట్ల సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే మూడు రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు, ఆగ్నేయం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని ఐఎండీ తెలిపింది.

Fire Accident : ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి మహిళ సజీవ దహనం

ఏపీలో అధిక చలి తీవ్రత
ఏపీలో కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. అయితే దక్షిణ కోస్తా ప్రాంతంలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాయలసీమ ప్రాంతంలో ఇవాళ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

పలు చోట్ల ఉరుములతో కూడిన వానలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. విశాఖలోని ఏజెన్సీ గ్రామాలను చలి వణికిస్తోంది. చలి భయంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. అటు ఉత్తర భారతాన్ని చలి భయపెడుతోంది.