Inter Religion Marriage: మరో దారుణానికి దారితీసిన మతాంతర వివాహం

హైదరాబాద్ నగరంలో మరో పరువు హత్య. తమ ఇంటి కూతురు మతాంతర వివాహం చేసుకుందనే కారణంతో యువకుడిని వెంటాడి హతమార్చాడు యువతి అన్న.

Inter Religion Marriage: మరో దారుణానికి దారితీసిన మతాంతర వివాహం

Kidnap Murder

Updated On : May 5, 2022 / 8:35 AM IST

Inter Religion Marriage: హైదరాబాద్ నగరంలో మరో పరువు హత్య. తమ ఇంటి కూతురు మతాంతర వివాహం చేసుకుందనే కారణంతో యువకుడిని వెంటాడి హతమార్చాడు యువతి అన్న. పెళ్లి చేసుకుని రెండు నెలలు గడుస్తుండటంతో పరిస్థితులు చక్కబడ్డాయని భావించిన ఆ యువ జంటను ఈ ఘటన తీవ్ర కల్లోలంగా మారింది.

రంగారెడ్డిజిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన నాగరాజు, అదే గ్రామానికి సమీపంలోని ఘనాపూర్‌లో ఉండే ఆశ్రిన్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ గురించి పెద్దలు ఒప్పుకోకపోగా కొన్నాళ్ల పాటు సాగిన వీరి ప్రేమకి పెద్దలు ఒప్పుకోలేదు. చాలా కాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ.. రెండు నెలల క్రితం 31.01.2022న ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు.

ప్రముఖ కార్ల షోరూమ్‌లో సేల్స్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న నాగరాజుపై యువతి సోదరుడు పగ పెంచుకున్నాడు. రెక్కీ నిర్వహించి ప్రస్తుతం వాళ్ళు ఉండే ప్రాంతాన్ని పసిగట్టాడు. ఈ క్రమంలోనే బైక్ పై వెళ్తున్న సమయంలో గడ్డపారతో దాడి చేశాడు.

Read Also : భువనగిరి పరువు హత్యకేసులో 13 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్రాథమిక విచారణలో ప్రేమ వివాహం ఇష్టం లేకనే దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నాగరాజు మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.