IT Searches : హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు.. 100 టీమ్స్ తో విస్తృత తనిఖీలు

కంపెనీలతోపాటు వ్యక్తుల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా అనేక సార్టు హైదరాబాద్ లో ఐటీ సోదాలు నిర్వహించారు.

IT Searches : హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు.. 100 టీమ్స్ తో విస్తృత తనిఖీలు

IT searches

Updated On : October 5, 2023 / 7:58 AM IST

IT Searches In Hyderabad : హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం హైదరాబాద్ తోపాటు శివారు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 100 టీమ్స్ తో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కంపెనీలతోపాటు వ్యక్తుల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తోపాటు కూకట్ పల్లిలోని ఆయన సోదరుల నివాసాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా అనేక సార్టు హైదరాబాద్ లో ఐటీ సోదాలు నిర్వహించారు. గత జూన్ లో హైదరాబాద్ లో ఐటీ భారీ కుంభకోణాన్ని బట్టబయలు చేసింది.

Gold Price Today: : బంగారం కొనుగోలుకు ఇదే మంచి సమయం..! మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు..

40 కోట్ల రూపాయల స్కామ్ ను ఐటీ అధికారులు బయటపెట్టారు. 8 మంది ట్యాక్స్ కన్సల్టెంట్లు, రైల్వేలు, పోలీసు శాఖలకు చెందిన పలువురు ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. తాజాగా నగరంలో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి.