బీజేపీ డైరెక్షన్‌లో చంద్రబాబు.. అందుకే తెలంగాణలో టీడీపీని..: జగ్గారెడ్డి

బీజేపీ ఆంధ్రలో పవన్ కల్యాణ్‌ను, తెలంగాణలో చంద్రబాబును ముందు పెట్టిందని..

బీజేపీ డైరెక్షన్‌లో చంద్రబాబు.. అందుకే తెలంగాణలో టీడీపీని..: జగ్గారెడ్డి

Jagga Reddy on Chandrababu Naidu: రాజకీయాల్లో విచిత్రమైన మార్పులు, చేర్పులు జరుగుతాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడినట్లే తెలంగాణలోనూ మొదలు పెట్టిందని తెలిపారు.

బీజేపీ ఆంధ్రలో పవన్ కల్యాణ్‌ను, తెలంగాణలో చంద్రబాబును ముందు పెట్టిందని చెప్పారు. పదేళ్ల తర్వాత ఇక్కడ చంద్రబాబు నాయుడు మళ్లీ ఎంట్రీ ఇచ్చారని, ఇది పొలిటికల్ గేమ్ అని అన్నారు. బీజేపీ ఆలోచన అంతా కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ మీదనే ఉంటుందని తెలిపారు. ఈ మూడు రాష్ట్రాల ఎంపీల సంఖ్యతోనే బీజేపీ అధికారం చేపట్టిందని చెప్పారు.

వాళ్ల ఆలోచన ప్రకారం ఆంధ్రలో చంద్రబాబుకి అన్ని సీట్లు రాకపోయి ఉంటే ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదని తెలిపారు. పవన్ కల్యాణ్ బీజేపీ డైరెక్షన్నే ఫాలో అవుతున్నారని ఆరోపించారు.

బీజేపీ, పవన్ దోస్తీ అనేది నాలుగు స్తంబాల ఆట అని చెప్పారు. ఏపీలో బీజేపీకి 3, జనసేనకు 2, టీడీపీకి 16 ఎంపీ సీట్లు వచ్చాయంటే పక్కా వ్యూహాత్మకంగా బీజేపీ ముందుకు వెళ్లిందని చెప్పారు. కాంగ్రెస్ లేకుండా చేస్తున్నారని అన్నారు. బీజేపీ చేతిలో చంద్రబాబు ఒక పావు అని చెప్పారు.

రాష్ట్ర విభజన తర్వాత అపరిష్కృత అంశాల పేరిట తెలంగాణలో చంద్రబాబు ఎంటర్ అయ్యారని తెలిపారు. ఏపీలో వేసిన పొలిటికల్ గేమ్ తెలంగాణలోనూ మొదలుపెట్టాలని చూస్తున్నారని చెప్పారు. బీజేపీ ఎన్ని వ్యూహాలు రచించినా కాంగ్రెస్ కార్యకర్తల శక్తిని చంపలేరని అన్నారు. ఈడీ, సీబీఐ వల్లే బీజేపీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు.

Also Read: మంత్రి పదవి ఆశిస్తున్నా.. సీఎం రేవంత్ రెడ్డికి విషయం చెప్పా: బీర్ల ఐలయ్య