మంత్రి పదవి ఆశిస్తున్నా.. సీఎం రేవంత్ రెడ్డికి విషయం చెప్పా: బీర్ల ఐలయ్య

మా కంటే తక్కువగా వున్న కమ్మ వాళ్లకు అవకాశాలు బాగా ఇస్తున్నారు.. మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాం.

మంత్రి పదవి ఆశిస్తున్నా.. సీఎం రేవంత్ రెడ్డికి విషయం చెప్పా: బీర్ల ఐలయ్య

Beerla ilaiah want to become a state minister in Revanth Reddy cabinet

Updated On : July 8, 2024 / 5:57 PM IST

Beerla ilaiah: తాను మంత్రి పదవి ఆశిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వెల్లడించారు. సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రి పదవిపై తన అభిప్రాయం సీఎం రేవంత్ రెడ్డికి చెప్పానని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఇద్దరికి మంత్రి పదవులు వచ్చాయని, భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఒక్కరూ కూడా మంత్రులుగా లేరని గుర్తు చేశారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో తనకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నట్టు చెప్పారు.

”గొల్లకురుమలు లేకుండా మంత్రి వర్గం ఎన్నడూ లేదు. మొదటిసారిగా గొల్లకురుమలకు మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. ఆంధ్రలో ముగ్గురికి మంత్రి వర్గంలో ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా మంత్రి వర్గంలో చోటు కల్పించడంతోపాటు ఎమ్మెల్సీ, ఒక అడ్వైజర్ పోస్ట్, ఐదు కార్పొరేషన్లు, పీసీసీ చీఫ్ పోస్ట్, పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్, రెండు సీఎంవో పీఆర్వో పోస్ట్ కావాలి. మా కంటే తక్కువగా వున్న కమ్మ వాళ్లకు అవకాశాలు బాగా ఇస్తున్నారు.. మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాం. 50 లక్షలపై చిలుకు జనాభా వున్న గొల్లకురుమలకు ప్రభుత్వంలో పదవులు ఇవ్వాలి. సీఎంపై నమ్మకం వుంది.. నాకు మంత్రి పదవి వస్తదని అనుకుంటున్నా.

కాంగ్రెస్ పార్టీని ఆదుకున్నది గొల్లకురుమలే. కేసీఆర్ గోర్లు బర్లు ఇస్తేనే ఓడగొట్టినం. సీఎం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సరితా తిరుపతయ్యకు హామీ ఇచ్చారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ వస్తే చేర్చుకుంటాం. తలసాని ఒక్కడే కాదు ఎవరు వచ్చినా చేర్చుకుంటాం. తలసాని అవినీతిపై ఆరోపణలు వున్నాయి. ఆయన మా పార్టీలోకి వచ్చినా సీఎం రేవంత్ తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారు. విభజన అంశాలపై ఇద్దరు సీఎంలు చర్చించార”ని బీర్ల ఐలయ్య అన్నారు.

Also Read : తెలంగాణలో కార్పొరేషన్ల చైర్‌ప‌ర్స‌న్ల‌ నియామకం.. ఎవరెవరికి ఏయే పదవులు దక్కాయంటే..?