జూన్ 20 నుంచి JNTUH Btech, B-pharmacy పరీక్షలు

  • Published By: Subhan ,Published On : June 5, 2020 / 10:22 AM IST
జూన్ 20 నుంచి JNTUH Btech, B-pharmacy పరీక్షలు

Updated On : June 5, 2020 / 10:22 AM IST

కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకునే క్రమంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా బీటెక్, బీ-ఫార్మసీ పరీక్షలు వాయిదాపడ్డాయి. చివరి సెమిస్టర్ పరీక్షలను జూన్ 20 నుంచి నిర్వహించాలని JNTUH నిర్ణయించింది. దీనికి సంబంధించిన కొన్ని కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. అంతేకాకుండా అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించిన సెమిస్టర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. 

ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మా-Dలో 2020-2021 సంవత్సరానికి గాను డిటెన్షన్‌ను రద్దు చేస్తున్నట్లు JNTU తెలిపింది. వివిధ సెమిస్టర్ పరీక్షలలో పాస్, ఫెయిల్ తో సంబంధం లేకుండా విద్యార్ధును తర్వాతి సెమిస్టర్ కు ప్రమోట్ చేయాలని నిర్ణయించుకుంది. యూనివర్శటీ గ్రాంట్స్ కమిషన్ (UGC),రాష్ట్ర ఉన్నత విద్యామండలి జారీ చేసిన మార్గదర్శాకాల ఆధారంగా పరీక్షల నిర్వహించనున్నట్లు జేఎన్ టీయూ గురువారం(జూన్ 4, 2020) న ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రధానాంశాలు ఇవే.. 

> 2020–21 విద్యా సంవత్సరంలో డిటెన్షన్‌ విధానాన్ని రద్దు చేసింది. నిర్దేశిత సబ్జెక్టులు పాస్‌ కాకున్నా విద్యార్థులందరిని తర్వాతి సెమిస్టర్‌కు అనుమతిని ఇచ్చింది.

> ముందుగా ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షల నిర్వహిస్తుంది. ప్రతి సబ్జెక్టు పరీక్ష 2 గంటల సమయం. మార్కుల విషయంలో ఏమి తేడా లేదు.

> పరీక్షల్లో 8 ప్రశ్నలకు గాను 5 ప్రశ్నలకు జవాబులు రాయాలి. పార్ట్‌ A, పార్ట్ B విధానం ఏమి లేదు. ప్రతి ప్రశ్నకు 20 నిమిషాల సమయం ఉంటుంది. 

> లాక్‌డౌన్‌ సమయంలో విద్యార్థులు కాలేజీలకు హాజరైనట్లుగానే పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది. అయితే  హాజరు తక్కువగా ఉన్న వారి వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచనుంది.

> ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు విద్యార్ధులు చదివే కాలేజీల్లోనే పరీక్షలు నిర్వహిచేలా ఏర్పాట్లు చేసింది.

>బీటెక్‌ నాలుగో సంవత్సరం, రెండో సెమిస్టర్, బీపార్మసీ రెండో సెమిస్టర్‌ పరీక్షలు, ఎంబీఏ, ఎంసీఏ ద్వితీయ సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్షలు జూన్ 20,2020 నుంచి ప్రారంభం కానున్నాయి. రవాణా సదుపాయం లేక పరీక్షలకు హాజరుకాలేని విద్యార్థులు 45 రోజుల్లో నిర్వహించే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు.

>బీటెక్‌ ఫస్టియర్, సెకండియర్, థర్డ్‌ ఇయర్‌ రెండో సెమిస్టర్‌ పరీక్షలు, ఫార్మ్‌–డి రెండో, మూడో, నాలుగో, 5వ సంవత్సరం, పార్మ్‌–డి (పీబీ) సెకండియర్‌(రెగ్యులర్&సప్లిమెంటరీ) పరీక్షలు జూలై 16,2020 నుంచి ప్రారంభం.

>ఆగస్టు 3,2020 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయిని తెలిపింది. బీటెక్ , బీపార్మసీ, ఫస్టియర్, సెకండియర్, థర్డ్‌ ఇయర్, నాలుగో ఇయర్ ఫస్ట్‌ సెమిస్టర్‌ పరీక్షలు ఆగస్టు 3వ తేదీ నుంచే ఉంటాయి. 

> ఎంబీఏ, ఎంసీఏ ఫస్టియర్‌ సెకండ్‌ సెమిస్టర్‌ రెగ్యులర్, ఎంసీఏ సప్లిమెంటరీ ఫస్టియర్, సెకండియర్, థర్డ్‌ ఇయర్‌ ఫస్ట్‌ సెమిస్టర్‌ పరీక్షలు, ఎంటెక్ సెకండ్‌ సెమిస్టర్‌ రెగ్యులర్, ఎంఫార్మసీ ఫస్ట్‌ సెమిస్టర్‌ సప్లిమెంటరీ పరీక్షలు, ఫార్మ్‌–డి ఫస్టియర్‌ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3, 2020 న ఉంటాయి.

>జూలై 1,2020 నుంచి జూలై15, 2020 వరకు కాంటాక్టు తరగతులు, ల్యాబ్‌ ఎక్స్‌పరిమెంట్స్, ల్యాబ్‌ పరీక్షల నిర్వహణ ఉంటుంది.

>బీటెక్, బీఫార్మసీ సెకండ్‌ సెమిస్టర్‌ (రెగ్యులర్‌), ఫస్ట్‌ సెమిస్టర్‌ (సప్లిమెంటరీ) పరీక్షలకు ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లింపు (రిజిస్ట్రేషన్‌) జూన్ 6,2020 లోగా పూర్తి చేయాలి.

>రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ తదితర ఫీజులను విద్యార్థులు కాలేజీకి రాకుండా ఆన్‌లైన్‌లో చెల్లించే ఏర్పాట్లు చేయాలి. ఫీజుల చెల్లింపు, ఫలితాల వివరాలను విద్యార్థులకు తెలియజేసేందకు వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేయాలని తెలిపింది.

 

సిబ్బంది, విద్యార్దులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
 
> విద్యార్థులు, సిబ్బంది క్యాంపస్‌లో ఉన్నప్పుడు మాస్క్‌లు ఖచ్చితంగా ధరించాలి. మాస్క్‌లు ధరించిన వారినే సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించాలి.

> ప్రతి క్యాంపస్ వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. విద్యార్థులు, సిబ్బంది వాటిని ఉపయోగించేలా చూడాలి.

> తరగతి గదులు, పరీక్ష హాళ్లు, ల్యాబ్‌లలో సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలి. 

> క్యాంపస్ లోకి ప్రవేశించటానికి ముందుగానే విద్యార్ధులందరికీ, సిబ్బందికీ థర్మల్‌ స్కానింగ్‌ తప్పనిసరిగా  అమలు చేయాలి. ప్రతిరోజు తరగతి గదులు, ప్రయోగశాలలను, కాలేజీ బస్సులను శానిటైజ్‌ చేయాలి. 

> ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఐసోలేట్‌ చేసి చికిత్సను అందించాలి.

> పరీక్షల సమయంలో విద్యార్థులు ప్రతి బెంచ్‌కు ఒకరే ఉండేలా చూడాలి. అదీ జిగ్‌జాగ్‌లో కూర్చోబెట్టాలి.

Read: బీబీనగర్ ఎయిమ్స్ లో 141 ప్రొఫెసర్ ఉద్యోగాలు