Job Recruitment: డీసీసీబీ హైదరాబాద్ లో ఉద్యోగాల భర్తీ

60శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి, తెలుగు భాషపై పట్టు ఉండాలి. నెల వేతనంగా 17,900 నుండి 57, 860 రూపాయల వరకు ఆయా పోస్టులను అనుసరించి చెల్లిస్తారు.

Job Recruitment: డీసీసీబీ హైదరాబాద్ లో ఉద్యోగాల భర్తీ

Dccb Jobs

Updated On : March 12, 2022 / 12:32 PM IST

Job Replacement : హైదరాబాద్ డిస్ట్ర్రిక్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 52 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో అసిస్టెంట్ మేనేజర్ 7ఖాళీలు, స్టాఫ్ అసిస్టెంట్ 45 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 18 సంవత్సారాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

60శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి, తెలుగు భాషపై పట్టు ఉండాలి. నెల వేతనంగా 17,900 నుండి 57, 860 రూపాయల వరకు ఆయా పోస్టులను అనుసరించి చెల్లిస్తారు. రాతపరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ దశలలో పరీక్ష ఉంటుంది. పరీక్ష అన్ లైన్ విధానంలో ఉంటుంది.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు దరఖాస్తు ఫీజుకు వివరాలకు సంబంధించి 900 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ,ఈడబ్య్ల్యూఎస్ అభ్యర్ధులకు 250 రూపాయలు ఫీజుగా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకోవటానికి చివరితేది మార్చి 6, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు http://www.hyderabaddccb.org సంప్రదించాలి.