Jubilee Hills Rape Case : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు

సంచలనం రేపిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో.. ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

Jubilee Hills Gang Rape Case

Jubilee Hills Gang Rape Case : సంచలనం రేపిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.

బాలిక గ్యాంగ్ రేప్ కేసులో మొత్తం ఐదుగురు నిందితులు ఉన్నారు. వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ కేసులో పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. నిందితులందరిని కూడా త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ఇప్పటికే స్పెషల్ టీమ్స్ ను కూడా రంగంలోకి దించారు పోలీసులు.

Rape On Girl : జూబ్లీహిల్స్ అమ్నేసియా పబ్‌ కేసు.. రోడ్లపై తిప్పుతూ కారులోనే బాలికపై ఐదుగురు అత్యాచారం

మరోవైపు మంత్రి కేటీఆర్ కూడా ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించొద్దు, వారిని కఠినంగా శిక్షించాలంటూ ట్విట్టర్ వేదికగా ఇటు హోంమంత్రిని, అటు డీజీపీని ఆదేశించారు మంత్రి కేటీఆర్.

నిందితుల కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశారు పోలీసులు. నిందితులు గోవా పారిపోయినట్లు అనుమానిస్తున్న పోలీసులు.. ఒక టీమ్ ను గోవాకు పంపారు.

MLA Raja Singh : వాహనాలు రేప్ చేశాయా? జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ఎమ్మెల్యే రాజాసింగ్ అనుమానాలు

జూబ్లీహిల్స్‌లో అమ్నేసియా పబ్ కు వచ్చిన 17 ఏళ్ల బాలికను కారులో ఇంటికి తీసుకెళ్తామని నమ్మించిన కొందరు యువకులు ఆమెపై కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు ఎమ్మెల్యే కుమారుడు, మరొకరు ప్రజా ప్రతినిధి కుమారుడు, వారి స్నేహితులు ఉన్నట్టు సమాచారం. అత్యాచారం అనంతరం బాలికను అదే పబ్ దగ్గర వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత బాలిక ఇంటికి వెళ్లింది. బాలిక మెడ చుట్టూ గాయాలు గమనించిన తండ్రి విషయం ఆరా తీశాడు. దీంతో అత్యాచారం విషయం బయటపడింది. గత నెల 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.