Jubilee Hills Gang Rape Case : జూబ్లీహిల్స్ రేప్ కేసు.. నేడు ఐదుగురు మైనర్ల కస్టడీ విచారణ
రాష్ట్రంలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల దర్యాఫ్తు కొనసాగుతోంది. అత్యాచారం కేసులో సోమవారం ఐదుగురు మైనర్ల కస్టడీ విచారణ జరగనుంది.

Jubilee Hills Gang Rape Case
Jubilee Hills Gang Rape Case : రాష్ట్రంలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల దర్యాఫ్తు కొనసాగుతోంది. అత్యాచారం కేసులో సోమవారం ఐదుగురు మైనర్ల కస్టడీ విచారణ జరగనుంది. ఐదుగురు మైనర్లని జువెనైల్ హోమ్ నుండి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తీసుకురానున్నారు.
Jubilee Hills Gang Rape : జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసు-టాటూ లా ఉండాలనే మెడపై కొరికాము
ఇప్పటికే ఐదుగురు మైనర్లను తీసుకెళ్లి నిన్న సీన్ రీ-కన్ స్ట్రక్షన్ చేశారు పోలీసులు. మరోవైపు ఈ కేసులో ఏ-1 సాదుద్దీన్ మాలిక్ ను పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం చంచల్ గూడ జైలుకి తరలించనున్నారు. ఐదుగురు మైనర్లను వివిధ కోణాల్లో బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, స్పెషల్ ఆఫీసర్ నర్సింగ్ రావు కస్టడీ విచారణ చేయనున్నారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
ఇది ఇలా ఉంటే.. అత్యాచారం కేసు విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు. మైనర్ బాలిక అత్యాచారం కేసులో పోలీసులు విచారణ జరుపుతున్న ఐదుగురు నిందితులు మేజర్లే అని ఆయన ఆరోపించారు. పోలీసులు వారిని మైనర్లుగా చూపి ఈ కేసులో ఐదుగురునీ తప్పించే ప్రయత్నం చేస్తున్నారని రఘునందన్ రావు అన్నారు.
కాగా, రఘునందన్ రావు కామెంట్స్ పై జూబ్లీహిల్స్ పోలీసులు కానీ, వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ కేసులో మేజర్లుగా ఉన్న ఐదుగురు నిందితులు.. బోగస్ ఆధార్ కార్డుతో మైనర్లుగా చూపించారని రఘునందన్ ఆరోపించారు. దీనిపై
పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.