Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భూయాన్

Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భూయాన్

Justice Ujjal Bhuyan

Updated On : May 17, 2022 / 2:44 PM IST

Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ను హైకోర్టు కొత్త సీజేగా నియమించారు. జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రాను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. సతీష్ చంద్ర మిశ్రాను బదిలీ చేసిన స్థానంలో జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కు పదోన్నతి కల్పించి సీజేగా నియమించేందుకు కొలీజియం సిఫార్స్ చేసింది.

ఐదు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్ ల నియమకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్స్ చేసింది. తెలంగాణతోపాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గువాహటి రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలను నియమించనున్నారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ విపిన్ సంఘీని ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా నియమించారు.

Judge Posts : తెలంగాణ హైకోర్టు లో 50 సివిల్ జడ్జి పోస్టుల భర్తీ

బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అమ్జద్ ఎ.సయిూద్ ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సీజేగా నియామకం అయ్యారు. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రష్మిన్ ఎం.ఛాయాను గువాహటి హైకోర్టు సీజేగా నియమించారు. బాంబే హైకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎస్ షిండే రాజస్థాన్ హైకోర్టు సీజేగా నియామకం అయ్యారు.