Jyotiraditya Scindia : చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి సింధియా
హైదరాబాద్ నగరానికి ఎంతో చరిత్ర ఉందని, పురాతనమైన చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి మహిమ ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. పాతబస్తీలో అభివృద్ధి అడ్డుకుంటున్న శక్తులకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సింధియా అన్నారు. పాతబస్తీకి మెట్రో రైలును ఎందుకు విస్తరించడం లేదో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.

Jyotiraditya Scindia
Jyotiraditya Scindia : హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా. ఓల్డ్ సిటీ బీజేపీ నేతలు, ఆలయ పూజారులు ఆయనకు స్వాగతం పలికారు. భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సింధియా. ఎంతో ప్రాచీనమైన భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకునే భాగ్యం తనకు కలిగినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు జ్యోతిరాదిత్య సింధియా.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
హైదరాబాద్ నగరానికి ఎంతో చరిత్ర ఉందని, పురాతనమైన చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి మహిమ ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. పాతబస్తీలో అభివృద్ధి అడ్డుకుంటున్న శక్తులకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సింధియా అన్నారు. పాతబస్తీకి మెట్రో రైలును ఎందుకు విస్తరించడం లేదో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. పాతబస్తీ అభివృద్దే బీజేపీ విధానం అన్నారాయన.