కాంగ్రెస్ విధానాల వైఫల్యం వల్లే ప్రపంచంలో భారత్‌కు ఈ పరిస్థితి: కేఏ పాల్
కాంగ్రెస్ అవినీతి విధానాల వల్లనే దేశంలో కాంగ్రెస్ తుడుచిపెట్టుకుపోయిందని తెలిపారు.

ka paul
కాంగ్రెస్ విధానాల వైఫల్యం వల్లే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వెనుకబడిందని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఇవాళ కేఏ పాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందిందని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక లక్ష కోట్ల రూపాయల అప్పు చేసిందని కేఏ పాల్ చెప్పారు. కాంగ్రెస్ అవినీతి విధానాల వల్లనే దేశంలో కాంగ్రెస్ తుడుచిపెట్టుకుపోయిందని తెలిపారు. కర్ణాటకలో ఇచ్చిన గ్యారెంటీలు అమలుచేయలేదని అన్నారు. ఉద్యోగాలు, ఉద్యోగ భృతి లేదు, రైతుబంధు లేదు అని విమర్శించారు.
కాంగ్రెస్ అవినీతి, అక్రమ పాలన కారణంగా దేశం వెనుకబడిందని కేఏ పాల్ చెప్పారు. కాంగ్రెస్ వైఫల్యాల వల్లనే ప్రాంతీయ పార్టీలు పుట్టాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ఎవరూ నమ్మడం లేదని చెప్పారు. కాంగ్రెస్ అవినీతి పార్టీల నుంచి అందరూ బయటకి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా పాలన అంటే రెడ్డిల పాలనా? ప్రజా పాలన అంటే బీసీల వ్యతిరేక పాలన? అని ఆయన అన్నారు.