వారికి కూడా భారతరత్న ఇవ్వాలి.. కులమతాలు చూడొద్దు: కేఏపాల్

కులాలు, మతాలు చూడకుండా దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ డిమాండ్ చేశారు.

వారికి కూడా భారతరత్న ఇవ్వాలి.. కులమతాలు చూడొద్దు: కేఏపాల్

ka paul

Updated On : February 9, 2024 / 4:24 PM IST

KA Paul: కుల, మతాలకు అతీతంగా దేశంలో గొప్ప సేవలు చేసిన వారికి భారతరత్న ఇవ్వాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. లోక్‌స‌భ‌ మాజీ స్పీకర్లు జీఎంసీ బాలయోగి, పీఏ సంగ్మా.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు కూడా భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి ఆలస్యంగా భారతరత్న ఇచ్చారని అన్నారు.

50 మందికి పైగా భారతరత్న ఇచ్చారు. ఎల్‌కే అద్వానీ గారిని ఎప్పుడో ప్రెసిడెంట్‌గా ప్రధాని చేయాలి. కానీ ఇప్పుడు భారతరత్న ఇచ్చారు. పివి నరసింహారావు గారి జయంతి రోజున కేంద్ర మంత్రి రూపాలతో మాట్లాడి పివికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశాను. దళితుడైన బాలయోగి దేశ సేవ చేసి హఠాన్మరణం చెందారు. బాలయోగికి కూడా భారత రత్న ఇవ్వాలి. దళితులకు భారతరత్న ఇవ్వరా? ట్రైబల్ లీడర్ ఆయన సంగ్మా గొప్ప వారు. ఆయనకు కూడా భారతరత్న ఇవ్వలేదు.

ఎన్టీఆర్ తెలుగురత్న ఆయన కంటే గొప్పవారు ఎవరు ఉన్నారు? ఆయన అన్ని రంగాల్లో నంబర్ వన్ అయ్యారు.. కానీ ఇప్పటి వరకు ఆయనకు సముచిత స్థానం కల్పించలేదు.ఆయన బ్రాహ్మిన్ కాదు కమ్మ కాబట్టి ఆయనకు భారతరత్న ఇవ్వలేదు. భారతరత్న విషయంలో కులాలను, మతాలను చూడకుండా దేశంలో గొప్ప సేవలు చేసిన వారికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నానని కేఏ పాల్ అన్నారు.

Also Read: తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న.. కేసీఆర్ ఏమన్నారంటే..?