Kaleshwaram Commission : కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకల ఆరోపణలపై విచారణ.. రామకృష్ణారావును ప్రశ్నించిన కమిషన్ ఛైర్మన్

రామక్రిష్ణారావు సమర్పించిన అఫిడవిట్, కాగ్ నివేదిక ఆధారంగా ఆయనపై ప్రశ్నలు సంధించారు.

Kaleshwaram Commission : కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకల ఆరోపణలపై విచారణ.. రామకృష్ణారావును ప్రశ్నించిన కమిషన్ ఛైర్మన్

Updated On : January 21, 2025 / 9:39 PM IST

Kaleshwaram Commission : కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకల ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా కమిషన్ ముందు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామక్రిష్ణరావు హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు రామక్రిష్ణరావును కమిషన్ విచారించింది. దాదాపు 24 ప్రశ్నలను కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ అడిగారు.

రామక్రిష్ణారావు సమర్పించిన అఫిడవిట్, కాగ్ నివేదిక ఆధారంగా ప్రశ్నలు సంధించారు. ఈ విచారణలో కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, లోన్లు, ప్రాజెక్ట్ డిజైన్లు, బడ్జెట్ కేటాయింపు, వడ్డీల చెల్లింపులు వంటి కీలక ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు నిధులు ఎలా వచ్చాయని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. రామకృష్ణారావును ప్రశ్నించింది.

బడ్జెట్ కేటాయింపులు, లోన్ల ద్వారా నిధులు సమీకరించినట్లుగా రామకృష్ణారావు సమాధానం ఇచ్చారు. కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారన్న కమిషన్ ప్రశ్నకు పరిశ్రమలకు, ఇతర అవసరాలకు నీళ్లు అమ్మి రెవెన్యూ జనరేట్ చేయడమే ప్రాజెక్ట్ లక్ష్యమని రామకృష్ణ చెప్పినట్లు సమాచారం. డిజైన్ల విషయంలో నిబంధనలు పాటించారా అని రామక్రిష్ణను కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ల బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన సమాధానం ఇచ్చారు.

డిజైన్లను అప్రూవల్ చేసే సమయంలో నిబంధనలను ఎందుకు పాటించలేదని కమిషన్ నిలదీయగా.. ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కోర్ కమిటీతో ఎప్పుడూ సమావేశం కాలేదని రామకృష్ణారావు చెప్పారు. కమిటీ రికార్డులు లేవని కమిషన్ ముందు రామక్రిష్ణారావు తెలిపారు. ఇక, ప్రాజెక్ట్ తొందరగా కట్టారు కానీ, నిబంధనలు ఎందుకు పాటించలేదని కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also Read : బీజేపీ స్టేట్‌ ప్రెసిడెంట్‌గా ఈటల పేరు ఖరారు అయిందా? రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో రామ్‌మాధవ్‌ చక్రం తిప్పుతున్నారా?

అలాగే అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పాలసీలు పెట్టారా అని కమిషన్ ప్రశ్నించగా.. దానికి రామక్రిష్ణారావు తెలియదని సమాధానం ఇచ్చారు. ప్రాజెక్ట్ కు సంబంధించిన ఫైల్స్ ప్రాపర్ గా క్యాబినెట్ ముందుకు రాలేదని, నిధుల విడుదల విషయంలో బిజినెస్ రూల్స్ ఎందుకు పాటించలేదని కమిషన్ అడిగింది. నిబంధనలు పాటించకుండా విడుదల చేసిన నిధుల రికార్డులను రామక్రిష్ణారావుకు కమిషన్ చూపించింది.

ఆర్థికపరమైన అంశాల్లో రికార్డులను సరిగా మెయింటేన్ చేయలేదని కమిషన్ ప్రశ్నించగా.. ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం గ్యారెంటీతోనే కార్పొరేషన్ లోన్స్ తీసుకుందని రామక్రిష్ణారావు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రిన్సిపల్ అమౌంట్ తో కలిపి 7వేల 300 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం తీసుకున్న లోన్లకు 9 నుంచి 10.5 శాతం వడ్డీ చెల్లిస్తున్నామని కమిషన్ కు తెలిపారు రామక్రిష్ణారావు.

 

Also Read : జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో బీఆర్ఎస్..