Kaleshwaram Commission: తెలంగాణ ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ లేఖ.. ఎందుకంటే?

ఇప్పటికే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌ రావును కమిషన్ విచారించింది.

Kaleshwaram Commission: తెలంగాణ ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ లేఖ.. ఎందుకంటే?

Updated On : June 17, 2025 / 10:36 AM IST

తెలంగాణ ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ లేఖ రాసింది. గత ప్రభుత్వంలోని క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని కోరింది. క్యాబినెట్ మినిట్స్ కోసం జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ లేఖ రాయడం ఇది మూడోసారి.

కేసీఆర్ స్టేట్‌మెంట్ తర్వాత ప్రభుత్వానికి కమిషన్ లేఖ రాయడం గమనార్హం. ఇంజనీర్లు ఓపెన్ కోర్టు స్టేట్‌మెంట్ తర్వాత ఓ సారి, ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత మరోసారి కూడా కమిషన్ లేఖ రాసింది. క్యాబినెట్ మినిట్స్ బయటికి ఇవ్వడానికి వీలు కాదని అధికారులు అంటున్నారు.

Also Read: కొత్త రేషన్ కార్డులపై ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా సర్వే

కమిషన్‌ వరుస లేఖల నేపథ్యంలో మినిట్స్ ఇవ్వాలా? వద్దా? అన్న విషయంపై క్యాబినెట్‌లో ప్రభుత్వం చర్చించనుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీల విషయంలో న్యాయ విచారణ కోసం జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌ రావును కమిషన్ విచారించింది. కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలను క్యాబినెట్‌ ఆమోదంతోనే తీసుకున్నామని వారు తెలిపారు. దీంతో క్యాబినెట్‌ నిర్ణయాలకు సంబంధించిన వివరాలు ఉంటే పంపాలని విజ్ఞప్తి చేస్తూ లేఖలు రాస్తోంది.