Kalvakuntla Kavitha : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత దంపతులు.. వీడియో

Kalvakuntla Kavitha : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, అనిల్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు.

Kalvakuntla Kavitha : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత దంపతులు.. వీడియో

Kalvakuntla Kavitha

Updated On : October 19, 2025 / 10:47 AM IST

Kalvakuntla Kavitha : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, అనిల్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు కవిత, అనిల్ దంపతులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో కవిత దంపతులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Also Read: Protests in US : అట్టుడుకుతున్న అమెరికా.. ట్రంప్‌నకు వ్యతిరేకంగా రోడ్లపైకొచ్చి నిరసన తెలుపుతున్న ప్రజలు.. ఎందుకంటే?

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈనెల 25 నుంచి తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు.. ఆ కార్యక్రమాన్ని విన్నవించుకునేందుకు ఇక్కడికి వచ్చానని తెలిపారు. నాలుగు నెలల పాటు ప్రజలతో మమేకం అయ్యే ఈ యాత్రకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని, బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు కవిత తెలిపారు.