Kalwakuntla Kavitha : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవం

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థి కోటిగిరి శ్రీనివాస్ నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు.

Kalwakuntla Kavitha : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవం

Kavitha

Updated On : November 24, 2021 / 2:36 PM IST

Nizamabad MLC Kalwakuntla Kavitha : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థి కోటిగిరి శ్రీనివాస్ నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. మధ్యాహ్నం 3 గంటలకు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. కోటిగిరి శ్రీనివాస్ నామినేషన్ లోని ఫామ్ 26లో తప్పులు చేయడంతోనే అతని నామినేషన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇక ఫామ్ లో బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వకపోవడంతో నామినేషన్ ను తిరస్కరించారు. దీంతో ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అంతకముందు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోర్జరీ వివాదం నెలకొంది. స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ నామినేషన్ పై వివాదం ఏర్పడింది. కోటిగిరి నామినేషన్ ను ప్రతిపాదిస్తూ నామినేషన్ ను సంతకాలు చేసిన ఇద్దరు వ్యక్తులు రివర్స్ అయ్యారు. తమ సంతకాలు ఫోర్జరీ చేశారంటూ ఆరోపిస్తున్నారు. కోటగిరి శ్రీనివాస్ నామినేషన్ తో తమకు సంబంధం లేదని చెబుతున్నారు.

MLC Elections : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోర్జరీ వివాదం

కోటిగిరి శ్రీనివాస్ నామినేషన్ పత్రాలపై నందిపేట ఎంపీటీసీ నవనీత, నిజామాబాద్ 31వ వార్డు డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ గజియా సుల్తానా పేరుతో సంతకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సంతకాలతో తమకు సంబంధం లేదని చెప్పారు. కోటగిరి శ్రీనివాస్ పై గజియా సుల్తానా రిటర్నింగ్ ఆఫీసర్ కు కంప్లైంట్ చేశారు.

అలాగే కోటిగిరి శ్రీనివాస్ నామినేషన్ లోని ఫామ్ 26లో తప్పులు చేయడంతోనే నామినేషన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇక ఫామ్ లో బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వకపోవడంతో నామినేషన్ ను తిరస్కరించారు. దీంతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.