Kamareddy District : కామారెడ్డి జిల్లా సోమార్‌పేటలో టెన్షన్ టెన్షన్.. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్గీయుల ఘర్షణ

Kamareddy District : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్ పేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత

Kamareddy District : కామారెడ్డి జిల్లా సోమార్‌పేటలో టెన్షన్ టెన్షన్.. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్గీయుల ఘర్షణ

Kamareddy District

Updated On : December 15, 2025 / 2:47 PM IST

Kamareddy District : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్ పేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం రెండో విడత పోలింగ్ జరిగింది. నిన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రత్యర్థి బాలరాజుపై కుర్మా పాపయ్య విజయం సాధించాడు. అయితే, సోమవారం గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

ఆదివారం వెలువడిన సర్పంచ్ ఫలితాలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన రాజు ఇంటిపై గెలిచిన వర్గం దాడికి పాల్పడింది. రాజు ఇంటిపై ట్రాక్టర్ తో పాపయ్య వర్గం దాడి చేసింది. తనపైనే పోటీ చేస్తారా అంటూ పాపయ్య వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది.

తన కుటుంబంపై దాడి చేశారంటూ బాలరాజు ఎల్లారెడ్డి, బాన్సువాడ ప్రధాన రహదారిపై బాధిత కుటుంబ సభ్యులు రాస్తారోకోకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో సోమార్ పేటలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. బాధితుల రాస్తారోకోతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పోలీసులు రంగంలోకిదిగి ఘర్షణకు సర్దుమణిగేలా చర్యలు చేపట్టారు.

కుర్మా పాపయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కి స్వయానా బాబాయ్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా రాజీనామా చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని సోమరిపేట గ్రామస్తులు ఎల్లారెడ్డికి తరలివచ్చి ఆంధోళనకు దిగారు. ఎల్లారెడ్డి బాన్సువాడ ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు.