కర్ణాటకలో రేపటి నుంచి… బస్సు,రైలు సర్వీసులు ప్రారంభం

లాక్ డౌన్ 4.0ప్రారంభమైన తొలిరోజన పెద్ద సడలింపులను కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కర్ణాటక వ్యాప్తంగా మంగళవారం(మే-18,2020)నుంచి బస్సు,రైలు,ట్యాక్సీ సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు యడియూరప్ప సర్కార్ ఓకే చెప్పింది. మే-17న కేంద్రహోంశాఖ సూచించిన విధంగా స్ట్రిక్ట్ సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటిస్తూ ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
అయితే కేవలం రాష్ట్రంలోనే ఈ సర్వీసులు ప్రారంభం అవుతాయి. ఇతర రాష్ట్రాల నుంచి,లేదా ఇతర రాష్ట్రాలకు ఈ సర్వీసులు నడువవు. అయితే ఆదివారం రోజుల్లో మాత్రం పూర్తి లాక్ డౌన్ కొనసాగుతందని,ఆ రోజు కేవలం ఎసెన్షియల్ సర్వీసులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మిగిలిన ఆరు రోజుల్లోనే ఈ సర్వీసులు రాస్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయి.
మరోవైపు కరోనా ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్ర,తమిళనాడు,గుజరాత్ రాష్ట్రాల నుంచి కర్ణాటకలోకి ఎవ్వరూ రాకుండా బ్యాన్ విధించింది కర్ణాటక ప్రభుత్వం. అంతేకాకుండా,కంటైన్మెంట్ జోన్లలో మినహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్క్ లు కూడా మంగళవారం నుంచి తెరుచుకోనున్నట్లు ఇవాళ హై లెవల్ మీటింగ్ తర్వాత కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వథ్ నారయన్ తెలిపారు.
రెడ్ జోన్లలోని కంటైన్మెంట్ ఏరియాల్లో మాత్రం కేవలం ఎసెన్షియల్ సర్వీసులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ నిబంధనలు రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు అవుతాయని యడియూరప్ప సర్కార్ తెలిపింది. కాగా,ఇప్పటివరకు కర్ణాటకలో 1100కి పైగా కరోనా కేసులు,30కి పైగా మరణాలు నమోదయ్యాయి.
Read: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నడుస్తాయా?