మాజీ సీఎం కేసీఆర్‌ను 50 నిమిషాల పాటు విచారించిన కాళేశ్వరం కమిషన్.. అడిగిన ప్రశ్నలు ఇవే
విచారణ ముగిశాక బీఆర్కే భవన్ నుంచి కేసీఆర్ బయటకు వచ్చారు.

KCR
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను కాళేశ్వరం విచారణ కమిషన్ హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో 50 నిమిషాల పాటు విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నివేదిక ఇచ్చారు. విచారణ ముగిశాక బీఆర్కే భవన్ నుంచి కేసీఆర్ బయటకు వచ్చారు.
క్రాస్ ఎగ్జామినేషన్‌ను కమిషన్ నోట్ చేసింది. కమిషన్ నోట్ పై తుది సంతకం పెట్టి కేసీఆర్ అక్కడి నుంచి బయలుదేరారు. బీఆర్‌కే భవన్ కుడి వైపు కార్యకర్తలు ఎక్కువగా ఉండడంతో… జీహెచ్‌ఎంసీ ఆఫీస్ వైపు నుంచి కేసీఆర్ వెళ్లారు. అందరికీ అభివాదం చేసి అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు. కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు కూడా కారులో ఉన్నారు.
కాగా, కేసీఆర్‌ను జస్టిస్ పీసీ ఘోష్ వన్ టు వన్ విధానంలో విచారణ జరిపారు. మీడియా, ఇతరులు లేకుండానే కేసీఆర్‌ను జస్టిస్ పీసీ ఘోష్ విచారణ జరిగింది. ప్రాజెక్టు రీ డిజైనింగ్‌పై కమిషన్ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
మూడు బ్యారేజ్ లకు సంబంధించిన రీడిజైన్ లపై కేసీఆర్‌ను ప్రశ్నలు అడగగా అన్నింటికీ అప్రూవల్స్ ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. వ్యాప్కోస్ నివేదిక ప్రకారం అక్కడ నీరు అందుబాటులో లేని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు ఎందుకు చేయాల్సి వచ్చిందో కేసీఆర్ వివరించారు. కొత్త రాష్ట్రం కాబట్టి.. ప్రభుత్వం వద్ద తగిన నిధులు లేకపోడంతో.. తొందరగా ప్రాజెక్టు కట్టాలనే ఆలోచనతో కార్పొరేషన్ ఏర్పాటు చేశామని అన్నారు. బ్యారేజ్ లలో వాటర్ నిలపడం అనే దానిపై ఇంజనీర్లు నిర్ణయం తీసుకుంటారని, ప్రభుత్వ నిర్ణయం ఉండదని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక ప్రశ్నలకు కేసీఆర్‌ను అడిగారు. కేసీఆర్‌ను 115వ సాక్షిగా విచారించారు.
ఇప్పటివరకు 114 మందిని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించిన విషయం తెలిసిందే. మొదట అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. అనంతరం మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావును ప్రశ్నించింది. కాగా, విచారణ వేళ ఎవరూ ఉండకూడదని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను కేసీఆర్ కోరడంతో ఆయన విజ్ఞప్తిని కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. జలుబుతో స్వల్ప అనారోగ్యానికి గురైనట్లు కేసీఆర్ తెలిపారు.
ఇంకా ఏయే ప్రశ్నలు అడిగారు?
THE LIFE LINE OF KALESWARAM PPRJECT అనే పేరుతో ఉన్న డాక్యుమెంట్ ను కమిషన్ కు కేసీఆర్ అందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 4000 మంది ఇంజనీర్లు పనిచేశారని కేసీఆర్ తెలిపారు. ప్రతి నిర్ణయాన్ని నివేదికల ఆధారంగా ఇంజనీర్లు నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు.
బ్యారేజీల లొకేషన్స్ మార్పు నిర్ణయం ఎవరు తీసుకున్నారని కమిషన్ అడిగింది. టెక్నికల్ నివేదికలు, వ్యాప్కోస్ సంస్థ నివేదికల ఆధారంగా లొకేషన్స్ మార్పు జరిగాయని కేసీఆర్ అన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ కట్టడానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదని తెలిపారు. మేడిగడ్డ వద్ద 230 TMC నీళ్లను లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉందని కేసీఆర్ చెప్పారు. మెయింటెనెన్స్ కోసం రూ.280 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ప్రాజెక్టుకు కావలసిన అన్ని సర్వేలు చేశాని కేసీఆర్ అన్నారు. కేంద్రం నుంచి రావలసిన అన్ని అనుమతులు ప్రాజెక్టుకు వచ్చాయని తెలిపారు.
Also Read: వైఎస్ జగన్ Vs నారా లోకేశ్.. సోషల్ మీడియా వార్.. వీడియోలు పోస్ట్ చేస్తూ..