KCR : కేసీఆర్ కీలక నిర్ణయం.. ఘనంగా బీఆర్ఎస్ రజతోత్సవాలు, వరంగల్‌లో భారీ బహిరంగ సభ..
తెలంగాణ సమాజం గర్వించేలా బీఆర్ఎస్ రజతోత్సవాలు ఉంటాయన్నారు గులాబీ బాస్.

KCR : తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా బీఆర్ఎస్ రజతోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. వరంగల్ లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కంకణబద్దులమై మరింతగా పోరాడదామని పిలుపునిచ్చారు కేసీఆర్. తెలంగాణ సమాజ రాజకీయ అస్తిత్వ పార్టీ బీఆర్ఎస్ అని అభివర్ణించారు.
Also Read : ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ 10మంది ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేలా కేసీఆర్ వ్యూహం..!
తెలంగాణ ప్రజల గుండెల్లో నెలవైన పార్టీ, తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ అని అన్నారు. రజతోత్సవాల్లో తెలంగాణ సమాజం అంతా భాగస్వాములే అన్నారు. తెలంగాణ సమాజం గర్వించేలా బీఆర్ఎస్ రజతోత్సవాలు ఉంటాయన్నారు గులాబీ బాస్. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం ముగిసింది. సుమారుగా 8 గంటల పాటు ఈ సమావేశం సాగింది.