KCR: కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్.. మాజీ సీఎంని అడగబోయే 20 ప్రశ్నలు ఇవే?
కమిషన్ అడిగే ప్రశ్నలకు గులాబీ బాస్ ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నారు?

KCR: కాళేశ్వరం కమిషన్ విచారణలో రేపు(జూన్ 11) కీలక ఘట్టం జరగబోతోంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బుధవారం ఉదయం 11 గంటలకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరుకాబోతున్నారు. అయితే ఈ విచారణ ఇన్ కెమెరాగా జరగబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ మాజీ సీఎంని కాళేశ్వరం కమిషన్ ఏం ప్రశ్నలు అడగబోతోంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ ఎలాంటి అంశాలను లేవనెత్తబోతున్నారు? కమిషన్ అడిగే ప్రశ్నలకు గులాబీ బాస్ ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నారు?
ఇప్పుడు ఇవే అందరిలోనూ ఆసక్తి రేపుతున్న అంశాలు. కాళేశ్వరం కమిషన్ కున్న అనుమానాలు ఏంటి? కేసీఆర్ ను ఏయే ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టబోతోందని ఉత్కంఠ రేపుతోంది. కాళేశ్వరం కమిషన్ విచారణ తుది అంకానికి చేరుకుంది. దాదాపు ఏడాది కాలంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించిన విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని విచారించబోతోంది.
ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో సంబంధం ఉన్న ఇంజినీర్లను, అధికారులను సుదీర్ఘంగా విచారించిన కమిషన్.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన ఈటల రాజేందర్, హరీశ్ రావులను సైతం విచారించింది. ఇక ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ వంతు వచ్చింది. ఉదయం 11 గంటలకు కేసీఆర్ బీఆర్కే భవన్ లోని కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరుకానున్నారు. దీంతో జస్టిస్ ఘోష్ కమిషన్ కేసీఆర్ ని ఎలా విచారించనుంది అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Also Read: శాఖల్లో సమూల మార్పులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం.. మంత్రుల్లో టెన్షన్
కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు వచ్చినప్పటి నుంచి.. విచారణకు సంబంధించిన అంశాలపై కేసీఆర్ దృష్టి సారించారు. అంతకుముందు కమిషన్ విచారణను ఎదుర్కొన్న కొందరు అధికారులు, ఇంజినీర్లతో కేసీఆర్ మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి న్యాయ నిపుణులతోనూ చర్చించారు కేసీఆర్.
ఇక మాజీ మంత్రి హరీశ్ రావుతో కమిషన్ విచారణకు ముందు, విచారణ తర్వాత పలుమార్లు భేటీ అయ్యారు కేసీఆర్. విచారణలో ఏం అడిగారు? ప్రాజెక్ట్ నిర్మాణం, ప్రారంభం నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలపై ఏం చెప్పావు అని హరీశ్ రావుని కేసీఆర్ అడిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ నెల 5న కమిషన్ విచారణకు హాజరైన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ని అడిగిన ప్రశ్నలు, తాజాగా హరీశ్ రావుని అడిగిన ప్రశ్నలని కేసీఆర్ బేరీజు వేసుకున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ అడిగే ప్రశ్నలు ఇవే?
1. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ను ఎందుకు రీ డిజైన్ చేశారు?
2. కాళేశ్వరం ప్రాజెక్ట్ రూపకల్పన ఎవరు చేశారు?
3. కాళేశ్వరం ప్రాజెక్ట్ డీపీఆర్ మంత్రివర్గం ఆమోదం పొందిందా?
4. మేడిగడ్డ బ్యారేజ్ స్థలాన్ని ఎందుకు మార్చారు?
5. జీవో 115 కింద మంత్రుల సబ్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారు?
6. కాళేశ్వరం ప్రాజెక్ట్, బ్యారేజీల లొకేషన్ మార్పు నిర్ణయం ఎవరిది?
7. హైపవర్ కమిటీలోకి బ్యారేజీల లొకేషన్ మార్పు అధికారం ఉందా?
8. మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు నేరుగా నీళ్లు ఇవ్వొచ్చని నిపుణుల కమిటీ చెప్పిందా?
9. కాళేశ్వరం కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారు?
10. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు అంశం క్యాబినెట్ ముందుకు వచ్చిందా?
11. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలను ఎలా చెల్లించాలనుకున్నారు?
12. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ జనరేట్ అయ్యిందా?
13. కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్ని బ్యారేజీలలో కలిపి ఎన్ని నీళ్లు నిల్వ చేశారు?
14. ప్రాజెక్ట్ బ్యారేజీలలో నీళ్లు నిల్వ చేయమని ఎవరు ఆదేశించారు?