తెలంగాణ డీజీపీ ఫోటోతో వ్యాపారవేత్తకు బెదిరింపులు.. అసలు విషయం ఏమిటంటే..

డీజీపీ రవిగుప్త వాట్సాప్ డీపీ ఫొటోతో సైబర్ మోసాలకు కేటుగాడు పాల్పడ్డాడు. ఓ వ్యాపారవేత్తకు వాట్సాప్ కాల్ చేసి

తెలంగాణ డీజీపీ ఫోటోతో వ్యాపారవేత్తకు బెదిరింపులు.. అసలు విషయం ఏమిటంటే..

Cyber Crimes

Telangana DGP : తెలంగాణ డీజీపీ ఫోటోతో ఓ కేటుగాడు బెదిరింపులకు పాల్పడ్డాడు. డీజీపీ రవిగుప్త వాట్సాప్ డీపీ ఫొటోతో సైబర్ మోసాలకు కేటుగాడు పాల్పడ్డాడు. ఓ వ్యాపారవేత్తకు వాట్సాప్ కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. అంతేకాక వ్యాపారవేత్త కూతురుకు కూడా ఫోన్ చేసి అగంతకుడు బెదిరింపులు పాల్పడ్డాడు.

Also Read : అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లతో పరార్.. టెస్కాబ్ ఉన్నతాధికారి వాణి బాల సస్పెండ్..

డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తున్నామని నమ్మించాడు. కేసు నుండి తప్పించేందుకు 50వేల రూపాయలు ఇవ్వాలని అగంతకుడు డిమాండ్ చేశాడు. వ్యాపారవేత్తకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. +92 కోడ్ తో వాట్సాప్ కాల్ రావడంతో ఇది పాకిస్తాన్ కోడ్ అని సైబర్ పోలీసులు గుర్తించారు.