Ganesh Chaturthi : ముస్తాబవుతున్న ఖైరతాబాద్ గణేష్

గణేష్ చతుర్థికి సమయం దగ్గర పడుతుండటంతో విగ్రహ తయారీ దారులు పనిలో జోరు పెంచారు. ఇక ఖైరతాబాద్ గణేశుడు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాడు.

Ganesh Chaturthi : ముస్తాబవుతున్న ఖైరతాబాద్ గణేష్

Ganesh Chaturthi

Updated On : September 4, 2021 / 4:42 PM IST

Ganesh Chaturthi : గణేష్ చతుర్థికి మరో ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది. సెప్టెంబర్ 10న గణేష్ చతుర్థి కావడంతో చాలామంది మండపాలు కట్టడం ప్రారంభించారు. గతేడాది కరోనా కారణంగా వేడుకలు లేకుండానే ముగిసిపోయింది. ఇళ్లవద్దనే చిన్న విగ్రహాలు నిలబెట్టి పూజలు చేశారు. గతేడాది విగ్రహ తయారీదారులు కూడా భారీగా నష్టపోయారు. అయితే ఈ ఏడాది వినాయక ఉత్సవాలకు అనుమతి రావడంతో పెద్ద సంఖ్యలో దేవుడి విగ్రహాలు కొలువుదీరనున్నాయి. గల్లికా గణేష్ పాటలతో పల్లెపల్లె మారుమోగనుంది.

ఇక ఈ నేపథ్యంలోనే తెలంగాణలోనే అత్యంత ఎత్తైన ఖైరతాబాద్ వినాయకుడు పూజలందుకునేందుకు సిద్ధమయ్యారు. 40 అడుగుల ఎత్తైన ఈ విగ్రహానికి శిల్పి రాజేంద్రన్ నేత్రాలు అలంకరించారు. ఈ విగ్రహానికి తుదిమెరుగులు తిద్దుతున్నారు. ఇక ఈ సారి న‌వ‌రాత్రోత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించుకోవాల‌ని భ‌క్తులు భావిస్తున్న తరుణంలో త‌యారీదారుల్లో జోష్ క‌నిపిస్తున్న‌ది. ఇప్ప‌టికే పెద్ద ఎత్తున బొజ్జ గ‌ణ‌ప‌య్య విగ్ర‌హాల‌ను తీర్చిదిద్దిన త‌యారీదారులు వాటికి తుదిమెరుగులు దిద్దుతున్నారు.