Rekha Nayak : బీఆర్ఎస్ రెబల్‌గా పోటీ చేస్తా, ప్రజలే గుణపాఠం చెబుతారు- ఎమ్మెల్యే రేఖా నాయక్ సీరియస్ వార్నింగ్

అభివృద్ధి నేను చేస్తే గొప్పలు వేరే వాళ్ళు చెప్పుకోవడం సరికాదన్నారామె. కక్షపూరితంగా అభివృద్ది పనులను ఆపివేస్తున్నారు అని ధ్వజమెత్తారు. Rekha Nayak

Rekha Nayak : బీఆర్ఎస్ రెబల్‌గా పోటీ చేస్తా, ప్రజలే గుణపాఠం చెబుతారు- ఎమ్మెల్యే రేఖా నాయక్ సీరియస్ వార్నింగ్

Rekha Nayak - Johnson Nayak (Photo : Google)

Updated On : September 18, 2023 / 6:36 PM IST

Rekha Nayak – Johnson Nayak : ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్.. బీఆర్ఎస్ ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ పై నిప్పులు చెరిగారు. రూ.2.25 కోట్ల ACDP నిధులు ఆపేసి తనను అణగదొక్కడానికి యత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. నా నియోజకవర్గ అభివృద్ధి నిధులు విడుదల చేయకపోతే ఖానాపూర్ NTR చౌరస్తాలో ధర్నా చేస్తాను అని ఆమె హెచ్చరించారు.

నా దగ్గరున్న SB కానిస్టేబుళ్లను తీసేయడం బాధాకరం అని ఆమె వాపోయారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు బీఆర్ఎస్ ఖాతాలో పడటానికి చాలా కృషి చేశాను అని రేఖా నాయక్ చెప్పారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఆమె హెచ్చరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెబల్ గా పోటీ చేస్తాను అని రేఖా నాయక్ ప్రకటించారు.

Also Read..KVP: కేవీపీపై రేవంత్‌రెడ్డికి కోపమెందుకు.. బీఆర్ఎస్‌కు వచ్చిన ఇబ్బందేంటి?

అభివృద్ధి నేను చేస్తే గొప్పలు వేరే వాళ్ళు చెప్పుకోవడం సరికాదన్నారామె. కక్షపూరితంగా అభివృద్ది పనులను ఆపివేస్తున్నారు అని ధ్వజమెత్తారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అన్న ఎమ్మెల్యే రేఖా నాయక్.. సరైన టైమ్ లో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ఇటీవల సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రం షాక్ ఇచ్చారు కేసీఆర్. వారి స్థానాలలో కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఈసారి టికెట్ నాకే అని నమ్మకంతో ఉన్న వారు.. టికెట్ మరొకరికి కేటాయించడంతో అధిష్టానం ఫై ఆగ్రహంగా ఉన్నారు. కొంతమంది పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు.

కేసీఆర్ షాక్ ఇచ్చిన ఆ నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఒకరు. అక్కడ రేఖా నాయక్ బదులు ఈసారి భూక్యా జాన్సన్‌ నాయక్‌ కు సీఎం కేసీఆర్‌ టికెట్‌ కేటాయించారు. దాంతో పార్టీ అధిష్టానంఫై రేఖా నాయక్ గుర్రుగా ఉన్నారు. పార్టీ అభ్యర్థుల లిస్టులో రేఖా నాయక్ పేరు రాకపోయేసరికి ఆమె భర్త ఆ మరుక్షణమే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొన్ని రోజుల్లో రేఖానాయక్ సైతం కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read..Sonia Gandhi: కర్ణాటకకు అప్పుడు 5 హామీలే.. తెలంగాణకు ఇప్పుడు 6 హామీలు ప్రకటించిన సోనియా