కేసీఆర్ ప్యాకేజీతోనే బండి సంజయ్‌ను దించేశారు: జగ్గారెడ్డి

కేసీఆర్ ప్యాకేజీతోనే బండి సంజయ్ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయి.. కిషన్ రెడ్డి తెరపైకి వచ్చారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు.

కేసీఆర్ ప్యాకేజీతోనే బండి సంజయ్‌ను దించేశారు: జగ్గారెడ్డి

kishan reddy appointed as bjp president with kcr package jagga reddy allegations

Jagga Reddy: కాంగ్రెస్ అధికారంలోకి రావడం బీజేపీకి ఇష్టం లేదని.. తమ పార్టీ ఇంఛార్జులపై అనవసరంగా కమలనాధులు ఆరోపణలు చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గురువారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ విమర్శలను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ నేతలు మొదట తమ బురద కడుక్కోవాలని సూచించారు. దీపాదాస్ మున్షి, మాణిక్యం ఠాగూర్, మానిక్‌రావ్‌ ఠాక్రేలను విమర్శించే అర్హత బీజేపీ నాయకులకు లేదని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీజేపీ నాయకుల మైండ్ బ్లాక్ అయిపోందని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ ప్యాకేజీతోనే బండి సంజయ్ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయి.. కిషన్ రెడ్డి తెరపైకి వచ్చారని ఆరోపించారు. ”ఏం మునిగిపోయిందని’బండి సంజయ్ పదవి తొలగించి నిన్ను అధ్యక్షుడిని చేశారు? బండి సంజయ్ వల్ల కేసీఆర్‌కి నష్టం అవుతుందని నోరు మెదపని కిషన్ రెడ్డిని ప్రెసిడెంట్ చేశారు. కేసీఆర్ ప్యాకేజీలో కిషన్ రెడ్డి బీజేపీ ప్రెసిడెంట్ అయ్యారు. అమిత్ షా చిట్టి రాసి పంపితేనే కిషన్ రెడ్డి మాట్లాడుతారు. కిషన్ రెడ్డి బీజేపీ ప్రెసిడెంట్ కావడంతో ఆ పార్టీ కార్యకర్తలు షాక్ అయ్యారు. ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో అనే కనీస జ్ఞానం లేని వ్యక్తి కిషన్ రెడ్డి” అని జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

అందుకే ఆర్టీసీ బస్సుల్లో సీట్లు దొరకడం లేదు
ఆర్టీసీలో మహిళల ఫ్రీ బస్ సాకర్యంపై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి స్పందించారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఉందో లేదో కిషన్ రెడ్డి తన భార్యని అడిగి తెలుసుకోవాలని సూచించారు. తనతో ఆర్టీసి బస్సుల్లో ప్రయాణానికి రావాల్సిందిగా కిషన్ రెడ్డిని కోరారు. సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామో లేదో కిషన్ రెడ్డికి డైరెక్ట్ చూపిస్తానని జగ్గారెడ్డి అన్నారు. ఉచిత బస్సుతో చాలామంది మహిళలు మేడారం జాతర వెళ్తున్నారని చెప్పారు. మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వాడుకుంటున్నారు కాబట్టే సీట్లు దొరకడం లేదని వివరించారు.

Also Read: నీటి పోరు యాత్ర.. మరో ఉద్యమానికి సిద్ధమైన బీఆర్‌ఎస్‌!

మోదీ ఇస్తానన్న 15 లక్షలు ఏవీ?
మోదీ ఇస్తానన్న 15 లక్షల రూపాయల గురించి కిషన్ రెడ్డి తన రథయాత్రలో చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. మోదీ ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాల్లో తెలంగాణ యువతకి ఎన్ని ఇప్పించారని ప్రశ్నించారు. బండి చేసిన విమర్శలపై స్పందిస్తూ.. తనకి తెలియకుండా తన కుర్చీ గాయబ్ చేస్తే కూడా ఏం చేయలేకపోయాడు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మేల్యేగా ఓడిపోవడంతో NVSS ప్రభాకర్‌కి మైండ్ ఖరాబ్ అయిందని సెటైర్ వేశారు.