Kishan Reddy : కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే : కిషన్ రెడ్డి

కాంగ్రెస్,బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే అంటూ రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి. ఎవరికి ఎవరు బీ టీమో తేల్చుకుందామా..? అంటూ సవాల్ విసిరారు.

Kishan Reddy : కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే : కిషన్ రెడ్డి

Kishan Reddy Comments On Rahul Gandhi

Updated On : October 19, 2023 / 4:39 PM IST

Kishan Reddy Fire On Rahul Gandhi : ఆర్ఎస్, బీజేపీ,ఎంఐఎం ఈ మూడు పార్టీలు ఒక్కటే అంటూ తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ మాటలకు కాంగ్రెస్,బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే అంటూ కౌంటర్ ఇచ్చారు. ఎవరికి ఎవరు బీ టీమో తేల్చుకుందామా..? అంటూ సవాల్ విసిరారు. ఈ విషయంపై చర్చకు సిద్ధమా..? అంటూ సవాల్ విసిరారు. ఢిల్లీలో అయినా ఓకే..హైదరాబాద్ లో అయినా ఓకే..చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం మీరు రెడీగా ఉన్నారా..? అంటూ ప్రశ్నించారు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసు ఉంది మరి ఆకేసును ఎందుకు తొక్కి పెట్టారు..? దానికి ఎందుకు దర్యాప్తు చేయటంలేదు అంటూ విమర్శించారు. సుప్రీంకోర్టు కూడా ఈ కేసుపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది అంటూ గుర్తు చేశారు.అన్ని విషయాలలో మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్ కు సహకరిస్తోందని కాంగ్రెస్, బీఆర్ఎస్,మజ్లిస్ పార్టీలు ఒక్కటే అన్నారు. ఏ పార్టీకి ఓటు వేస్తే ఏ పార్టీకి ఓటు వేసినట్లో తేల్చుకుందామా.. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో గానీ ఢిల్లీ లో గానీ స్థలం మీరు డిసైడ్ చేయండీ చర్చకు మేం రెడీ అంటూ సవాల్ చేశారు.

Governor Indrasena Reddy : నాకు గవర్నర్ పదవి రావటం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు : ఇంద్రసేనారెడ్డి

కాగా పెద్దపల్లి జిల్లాలో రాహుల్ గాంధీ మాట్లాడుతు..పార్లమెంటు లో బీజేపీ, బీఆర్ఎస్ సహకరించుకుంటున్నాయని..ఎంఐఎం పార్టీ అభ్యర్థులు బీజేపీకి మద్దతు తెలుపుతురని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా విమర్శలు చేస్తారు కానీ ఢిల్లీలో మాత్రం చేతులు కట్టుకుని నిలబడతారు అంటూ విమర్శించారు. భారతదేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది రాహుల్ గాంధీ అన్న ఆయన నా DNA కూడా కాంగ్రెస్ పార్టీ సిద్దాంతం కొరకే అంటూ వ్యాఖ్యానించారు.