Kishan Reddy: తెలంగాణలో ఆ పని చేసే అధికారం కాంగ్రెస్‌కు లేదు: కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించుకోవాలంటే భాగ్యలక్ష్మి ఆలయం వద్ద నెహ్రూ కుటుంబం రక్తం వచ్చేలా ముక్కు నేలకు రాయాలన్నారు.

Kishan Reddy: తెలంగాణలో ఆ పని చేసే అధికారం కాంగ్రెస్‌కు లేదు: కిషన్ రెడ్డి

Kishan Reddy

Kishan Reddy – Telangana Liberation Day: బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) పార్టీపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లాలోని పరకాలలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది.

ఈ సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ… సెప్టెంబర్ 17న తెలంగాణలో సమావేశం నిర్వహించే అధికారం కాంగ్రెస్‌కు లేదని అన్నారు. ఒకవేళ హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించుకోవాలంటే భాగ్యలక్ష్మి ఆలయం వద్ద నెహ్రూ కుటుంబం రక్తం వచ్చేలా ముక్కు నేలకు రాయాలన్నారు. తెలంగాణ చరిత్రను దాచిపెడతారా అని ప్రశ్నించారు.

మజ్లిస్ ఆత్మే కేసీఆర్‌ను ఆడిస్తోందని అన్నారు. నైజాం ఓడిపోయిన దినం సమైక్యతా దినం ఎలా అవుతుందని నిలదీశారు. సమైక్య దినం అనే వారు చరిత్ర హీనులని చెప్పారు. ఇది సమైక్యత దినమో, విమోచన దినమో తేల్చుకునేందుకు కేసీఆర్ పరకాలకు రావాలని కిషన్ రెడ్డి సవాలు విసిరారు.

తాము అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన రోజని చెప్పారు. తెలంగాణలో మూడురంగుల జెండా ఎగురవేసిన రోజు అని అన్నారు. మజ్లీస్‌కు భయపడి నాడు కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని తెలిపారు.

Navdeep: మానసిక ఒత్తిడికి గురవుతున్నా.. నా సినీ కెరీర్‌పై..: డ్రగ్స్ కేసుపై హీరో నవదీప్