Komati reddy raj gopal reddy : పార్టీ మార్పు వార్తలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్

తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజల ఆకాంక్షలను ముందుకు నడిపించే సత్తా మోదీ, అమిత్ షా ఉందని విశ్వసించి దేశ సౌభాగ్యంలో నేను కూడా భాగస్వామి కావాలని అడుగు వేశాను అన్నారు. Komati reddy raj gopal reddy

Komati reddy raj gopal reddy : పార్టీ మార్పు వార్తలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్

Komati reddy Raj Gopal Reddy

Updated On : October 6, 2023 / 12:02 AM IST

Komati reddy raj gopal reddy – BJP : తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై బీజేపీ నేత కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. పార్టీ మార్పుపై ఆయన క్లారిటీ ఇచ్చారు. బీజేపీని వీడుతున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. నా వ్యక్తిగత స్వార్థం కోసం సిద్ధాంతాలను మార్చే వ్యక్తిని కాదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తేల్చి చెప్పారు. నా చుట్టూ ఉన్న సమాజం కోసం నా వంతు మంచి చేయాలనే లక్ష్యంతో రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నా అని వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు ఎంపీ పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాను అని గుర్తు చేశారు. అన్ని వర్గాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో.. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు నన్నెంతో కలచివేశాయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాపోయారు. ప్రజా తెలంగాణ బదులు ఒక కుటుంబం కోసమే తెలంగాణ అన్నట్లు పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజల ఆకాంక్షలను ముందుకు నడిపించే సత్తా మోదీ, అమిత్ షా ఉందని విశ్వసించి దేశ సౌభాగ్యంలో నేను కూడా భాగస్వామి కావాలని అడుగు వేశాను అన్నారు.

Also Read..Warangal: ఎమ్మెల్యే రాజయ్యను పక్కన పెట్టడంతో.. టెన్షన్ పడుతున్న ఎంపీ దయాకర్‌

నేనే కాదు ఇతర ముఖ్య నాయకులు ఎవరూ బీజేపీని వీడరు అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తేల్చి చెప్పారు. కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించే దిశగా భారతీయ జనతా పార్టీ సైనికులై ముందుకు కదులుతామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.