KTR-Komatireddy Venkatareddy : ‘కోవర్టు రెడ్లు’ అంటూ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్

కోమటిరెడ్డి బ్రదర్స్ ని వాళ్లు కోమిరెడ్లు కాదు కోవర్టు రెడ్లు అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు..తెలంగాణ ఉద్యమంలో రబ్బరు బుల్లెట్లు తిన్న మేం కోమర్టులమా? తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసిన నేను కోవర్టునా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తు కేటీఆర్ పై విరుచుకుపడ్డారు.

KTR-Komatireddy Venkatareddy : ‘కోవర్టు రెడ్లు’ అంటూ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్

 KTR-Komatireddy Venkatareddy

Updated On : October 11, 2022 / 6:23 PM IST

KTR-Komatireddy Venkatareddy : కోమటిరెడ్డి బ్రదర్స్ ని వాళ్లు కోమిరెడ్లు కాదు కోవర్టు రెడ్లు అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు..తెలంగాణ ఉద్యమంలో రబ్బరు బుల్లెట్లు తిన్న మేం కోమర్టులమా? తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా ఎంచి వదిలేసిన నేను కోవర్టునా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తు కేటీఆర్ పై విరుచుకుపడ్డారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి. మాపై అనవసరమైన ఆరోపణలు చేస్తే మీ అవినీతి చిట్టా మొత్తం బటయపెడతానని..మీగురించి నాకు అంతా తెలుసు నా జోలికి రావద్దు నన్ను కెలకొద్దు మీ బండారం మొత్తం బయటపెడతాను అంటూ హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో నువ్వెక్కడున్నావు? అమెరికాలో ఉండి సడెన్ గా ఊడిపడ్డావని గుర్తు చేసుకోమని ఈ విషయం ఎవరికి తెలియదనుకున్నావు? అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

కాగా..మునుగోడు ఉప ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీల నేతలు మాటలతో యుద్ధాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కోమటిరెడ్డి బ్రదర్స్ పై విమర్శలు చేస్తూ..అన్న కాంగ్రెస్ లోను..తమ్ముడు బీజేపీలోను ఉన్నారని వీరిద్దరు కోమటిరెడ్డి బ్రదర్స్ కాదు కోవర్టులు అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనన్నారు. మోడీ చెప్పే డబుల్ ఇంజన్ జుమ్లా..హమ్లా అంటూ ఎద్దేవా చేశారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ ను ఉద్ధేశించి ఒక కాంట్రాక్టరు బలుపు..అహంకారం వల్లే మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చిందన్నారు. మిషన్ భగీరథ పథకంతో నల్గొండ ఫ్లోరోసిస్ సమస్యను తరిమి కొట్టిన ఘతన కేసీఆర్ ది అయితే కాంట్రాక్టుల కోసం పార్టీని వీడిన చరిత్ర కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డిది అని త్వరలోనే ఆయన సోదరుడు వెంకట్ రెడ్డికూడా పార్టీ మారుతాడు అంటూ చెప్పుకొచ్చారు కేటీఆర్. నల్గొండ అభివృద్ధికి రూ.18వేల కోట్లు ఇస్తే టీఆర్ఎప్ పార్టీ మునుగోడు ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకుంటుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఈక్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు.