Koonamneni Sambasivarao : తెలంగాణలో బీజేపీ పని అయిపోయింది : కూనంనేని సాంబశివరావు

మునుగోడులో తాము సపోర్ట్ చెయకపోతే బీజేపీ గెలిచేదన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి వెళ్లే వాళ్ళని వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ ప్రయోగాలు చేస్తుందని చెప్పారు.

Koonamneni Sambasivarao : తెలంగాణలో బీజేపీ పని అయిపోయింది : కూనంనేని సాంబశివరావు

Koonamneni Sambasivarao

Koonamneni Sambasivarao criticized BJP and Modi in Karimnagar

వరంగల్ వచ్చిన ప్రధాని మోదీ సామాన్యుడీలా వచ్చి వెళ్లడం అభ్యoతరకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. విభజన చట్టాల హామీల విషయంలో ఆందోళనలు చేశామని తెలిపారు. కోచ్ ఫ్యాక్టరీ వేలాది మందికి ఉపాధి కల్పించాలి.. కానీ, 12వందల మందికే ఇక్కడ ఉపాధి దొరుకుతుందన్నారు. బండి సంజయ్ ని అధ్యక్షుడిగా తొలగించి కిషన్ రెడ్డికి పదవి ఇవ్వడంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లాలో మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో బీజేపీ పని అయి పోయిందని పేర్కొన్నారు. మునుగోడులో తాము సపోర్ట్ చెయకపోతే బీజేపీ గెలిచేదన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి వెళ్లే వాళ్ళని వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ ప్రయోగాలు చేస్తుందని చెప్పారు. బీజేపీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఆశలు వదిలేసుకుందని స్పష్టం చేశారు. 24 ఎన్నికల నాటికి బీజేపీ గెలవదనే భయం మోదీకి పట్టుకుందన్నారు.

Minister Amarnath : పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో సైడ్ హిరో, చంద్రబాబు విలన్ : మంత్రి అమర్నాథ్

దేశంలో ఎన్డీఏ, యూపీఏ.. రెండు కూటములే ఉంటాయని, థర్డ్ ఫ్రంట్ కి అవకాశం ఉండదన్నారు. రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలని నిందిస్తారి.. తమ వ్యక్తిత్వం తమకు ఉందన్నారు. మునుగోడు ఎన్నికల తర్వాత చాలా సార్లు సీఎంని కలిశామని తెలిపారు. బీఆర్ఎస్ తో తమకు బ్రేకప్ కాలేదని స్పష్టం చేశారు. కుదిరితే పొత్తులు ఉంటాయని, లేదంటే సింగిల్ గానే పోటీ చేస్తామని తెలిపారు.

మహాత్మా గాంధీ, జయ ప్రకాష్ నారాయన్ ని పోటీ లో పెట్టండి… గెలుస్తారో చూడండి అని పేర్కొన్నారు. మునుగోడులో అన్ని పార్టీలు పైసలు ఖర్చు పెట్టాయని పేర్కొన్నారు. తాము తమలాగానే ఉంటామని, ఎవరికీ తలవంచమ్…లొంగమ్, గౌరవానికి భంగం కలిగితే ఊరుకోబోమని హెచ్చరించారు.