Happy Birthday KTR : GIFT A SMILE , కేటీఆర్ పై స్పెషల్ సాంగ్

  • Published By: madhu ,Published On : July 24, 2020 / 11:14 AM IST
Happy Birthday KTR : GIFT A SMILE , కేటీఆర్ పై స్పెషల్ సాంగ్

Updated On : July 24, 2020 / 11:37 AM IST

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR Birthday  సందర్భంగా పలువురు శుభకాంక్షలు తెలియచేస్తున్నారు. ఆయన జన్మదిన వేడుకలను పార్టీ కేడర్‌ సాదాసీదాగా జరుపుకోనుంది. గిఫ్ట్‌ విత్‌ స్మైల్‌ అనే పిలుపుతో పేదలను ఆదుకునేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు రెడీ అయ్యారు. రక్తదాన శిబిరాలు, పేదలకు ఆపన్నహస్తం అందించేందుకు నాయకులు ఏర్పాట్లు చేశారు.

గులాబీ పార్టీ యువనేత, మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని ఘనంగా జరుపుకునేందుకు పార్టీ నేతలు సిద్ధమయ్యారు. అయితే కరోనా పరిస్థితుల్లో ఆడంబరాలకు పోకుండా… నిరాడంబరంగా తన జన్మదిన వేడుకలను నిర్వహించాలని స్వయంగా కేటీఆర్‌ కేడర్‌కు సూచించారు. పేదలకు అందించే సహాయంపై దృష్టి పెట్టాలన్నారు. దీంతో నేతలంతా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. దీన్ని జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రారంభించారు.

యువనేతపై తమ అభిమానాన్ని పార్టీ శ్రేణులు పలు రకాలుగా చాటుకుంటున్నారు. తాను గీసిన 108 చిత్రపటాలను కేటీఆర్‌కు బహూకరించేందుకు ఎన్ఆర్ఐ సిద్ధపడుతున్నారు. అటు సిరిసిల్లలో జరిగిన అభివృద్ధిపై సీడీని రూపొందించిన నేతలు.. కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. అంతేకాదు..

తెలంగాణ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. మరికొందరు నేతలు రాష్ట్రవ్యాప్తంగా భారీగా మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలను కరోనా బాధితులను ఆదుకునేందుకు నేతలు సిద్ధమవుతున్నారు.

కేటీఆర్‌ బర్త్‌డే సందర్భంగా హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో కేటీఆర్‌తోపాటు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు జూబ్లిహిల్స్ MLA మాగంటి గోపినాద్ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో కేటీఆర్‌, తలసాని పాల్గొన్నారు.

ఇక ఉదయం 9.30కు సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కలాసిగూడలోని ప్రభుత్వ పాఠశాలలలో జిల్లా విద్యాధికారితో కలిసి విద్యార్ధులకు పుస్తకాలు పంపిణీ చేశారు. పదిన్నరకు TRSV రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో.. TRS భవన్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.

ఇక 11 గంటలకు నాంపల్లిలోని నీలోఫర్ హాస్పిటల్‌లో TRS ఇంచార్జి ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. 11.30కు గన్‌ఫౌండ్రీ కార్పొరేటర్‌ మమతా సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో కోఠి మెటర్నిటీ హాస్పిటల్‌లో పండ్లు, చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా కేటీఆర్‌ రోగులకు పండ్లు, చీరలను పంపిణీ చేస్తారు.

ఇక మధ్యాహ్నం 12 గంటలకు బేగంబజార్ చత్రిలో TRS నాయకులు నందు బిలాల్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కేక్ కట్ చేసి పేదలకు పండ్లు, మహిళలకు చీరలను పంపిణీ చేస్తారు.

ఇదిలా ఉంటే..టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్‌డే పురస్కరించుకొని… రూపొందించిన ప్రత్యేక పాటను రిలీజ్ చేశారు కేటీఆర్ సోదరి కవిత. వెనుకడుగేయని కాలం పేరే కేటీఆర్ అంటూ సాగే ఈ పాటను మిట్టపల్లి సురేందర్ రాయగా… యాజీన్ నిజార్ పాడారు. కేటీఆర్ సాధించిన విజయాలు, ప్రజలతో మెలిగే విధానాన్ని ఈ సాంగ్‌లో వివరించారు.

మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి రూపొందించిన ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. సోదరుడిపై రూపొందించిన పాటను రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు కవిత.