అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.

ktr, komatireddy rajagopal reddy interesting discussion in telangana assembly
ktr, komatireddy rajagopal reddy: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అసెంబ్లీ ఆవరణలో ఎదురుపడిన ఇరువురు నాయకులు ఒకరినొకరు పలకరించుకున్నారు. మంత్రి పదవి ఎప్పుడు వస్తుందని రాజగోపాల్ రెడ్డిని కేటీఆర్ అడగ్గా.. మీ లాగానే తమకు ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతోందని సమాధానం ఇచ్చారు. ఫ్యామిలీ పాలన కాదు.. మంచిగా పని చేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయని కేటీఆర్ కౌంటర్ వేశారు.
ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తుందా, మీ అబ్బాయి సంకీర్త్ పోటీ చేస్తున్నారా అని రాజగోపాల్ రెడ్డిని కేటీఆర్ అడిగారు. తన భార్య లక్ష్మీ పోటీ చేస్తుందని సరదాగా సమాధానం ఇచ్చారు. దయ చేసి తనను వివాదాల్లోకి లాగొద్దని రాజగోపాల్ రెడ్డి అనడంతో.. తర్వాత మాట్లాడదాం అంటూ కేటీఆర్ వెళ్లిపోయారు. కాగా, వీరిద్దరి సంభాషణను అక్కడ ఉన్న నాయకులు ఆసక్తిగా విన్నారు.
ఎమ్మెల్సీలతో కేటీఆర్ భేటీ
బీఆర్ఎస్ ఎల్పీలో ఎమ్మెల్సీలతో కేటీఆర్ భేటీ అయ్యారు. శాసన మండలిలో తమ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్సీలతో ఆయన చర్చలు జరిపారు.
Also Read: నేను చాంబర్ల చుట్టూ తిరుగుతున్నా.. రేవంత్ మాత్రం సీఎం అయ్యారు..
కాగా, తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగించిన తర్వాత సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఈ నెల 10న శాసనసభలో ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.